S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/29/2016 - 07:26

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై ప్రభుత్వ నిర్ణయంపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. భూసేకరణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం 2015లో జారీ చేసిన జీవో 75, 123, 190, 214ను సవాలు చేస్తూ ఎస్ ఉపేందర్ రెడ్డి మరో 14 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

06/29/2016 - 06:25

హైదరాబాద్, జూన్ 28: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయ. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఖరీఫ్ రైతాంగానికి ఊపిరి పోశాయి.

06/29/2016 - 06:24

కరీంనగర్, జూన్ 28: పుట్టిన బిడ్డ రెండ్రోజులకే చనిపోయందన్న మనోవేదనతో ఆ తల్లి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. వేముల లావణ్య (23) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు- కొత్తపల్లి గ్రామానికి చెందిన లావణ్యకు రామడుగు మండల కేంద్రానికి చెందిన వేముల రమేష్‌తో సంవత్సరం క్రితం వివాహం జరిగింది.

06/29/2016 - 06:24

తొగుట, జూన్ 28: మల్లన్నసాగర్‌కు భూములు రిజిస్ట్రేషన్ చేసిన రైతుల పంటల పై మహిళలు మరోసారి ఆగ్రహించి ధ్వంసం చేసిన సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది.

06/29/2016 - 06:23

హైదరాబాద్,జూన్ 28: ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నిర్ధారణకు తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఎబివిపి) హైదరాబాద్‌లో డిఇఓ కార్యాలయాలను ముట్టడించింది. డిఇఒ కార్యాలయాల ఎదుట ఎబివిపి కార్యకర్తలు వందలాది మంది ధర్నా నిర్వహించారు.

06/29/2016 - 06:22

జనగామ టౌన్, జూన్ 28: ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భారీఎత్తున ఆందోళన నిర్వహించారు.

06/29/2016 - 06:21

వరంగల్, జూన్ 28: తెలంగాణ న్యాయమూర్తులపై హైకోర్టు విధించిన సస్పెన్షన్ వ్యవహారం వరంగల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. హైకోర్టు విభజన విషయంలో న్యాయం చేయాలంటూ 20 రోజులుగా ఆందోళనలు చేపట్టిన సమయంలో హైకోర్టు సస్పెన్షన్ నిర్ణయం మరింత వివాదానికి దారితీసింది. మంగళవారం వరంగల్ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

06/29/2016 - 06:20

హైదరాబాద్, జూన్ 28: న్యాయాధికారుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ మంగళవారం న్యాయవాదులు హైకోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. కోర్టు ఉత్తర్వులకు నిరసనగా న్యాయవాదులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు వద్ద ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకోగా పోలీసులు, న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

06/29/2016 - 06:18

మహబూబ్‌నగర్, జూన్ 28: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్వాసితుల్లో రోజురోజుకూ గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఇదివరకు ఈ ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణానికి 123 జిఓను తీసుకువచ్చి అందుకు సంబంధించిన భూమి కొనుగోలు ప్రక్రియను ఇప్పటికే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

06/29/2016 - 04:49

ఖమ్మం, జూన్ 28: ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే అనేక చెరువులు అలుగులు పడగా, ఖరీఫ్ సీజన్‌కు అనుకూలమైన వర్షాలు పడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా బూర్గంపాడు మండలంలో 72.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది.

Pages