S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/25/2016 - 14:28

ఖమ్మం: ఓ రిటైర్డు ఉద్యోగి నుంచి రెండు వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా ఇక్కడి కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ టి.శ్రీనివాసరావును గురువారం నాడు ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

02/25/2016 - 11:51

ఖమ్మం: పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ఆరేళ్ల బాలికను వ్యాన్ రూపంలో మృత్యువు కాటేసింది. చండ్రుఒండ మండలం దామరచర్ల ప్రాథమిక పాఠశాల సమీపంలో గురువారం ఉదయం ఈ దారుణం జరిగింది. వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో, హేమశ్రీ అనే ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది.

02/25/2016 - 11:47

హైదరాబాద్: పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ యువతిని శ్రవణ్ అనే యువకుడు కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరచిన సంఘటన బోయిన్‌పల్లిలోని ఇక్రిసాట్ కాలనీలో గురువారం ఉదయం జరిగింది. కత్తిపోట్లకు గురైన ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు.

02/25/2016 - 07:12

జగిత్యాల: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను చంపుతామని మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఫోన్‌కు కాల్ వచ్చింది. ఈ సమయంలో కోరుట్ల ఎస్సై బాబూరావు ఎమ్మెల్యే పక్కనే ఉండడంతో ఆ ఫోన్‌ను ఎస్సైకి ఇచ్చారు. దీంతో ఎస్సై ఆ ఫోన్‌లోనే మాటలను పొడిగించే ప్రయత్నం చేయడంతో పరుషపదజాలంతో దూషించడంతో ఎస్సై ఫోన్ కట్ చేశారు.

02/25/2016 - 07:11

సంగారెడ్డి: జైలు జీవితం అంటే ఏ విధంగా ఉంటుంది.. శిక్షలను ఏ విధంగా అమలు చేస్తారు.. శిక్ష పూర్తిగా అమలయ్యే వరకు నాలుగు గోడల మధ్య బాహ్య ప్రపంచాన్ని చూడకుండా ఉండే విధానాలను సాధారణ వ్యక్తులు కూడా తెలుసుకునే వెసులుబాటును జైళ్ల శాఖ కల్పించనుంది.

02/25/2016 - 06:55

హైదరాబాద్: రాజకీయ కక్షతోనే తన కుమారుడిపై సిబిఐ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి, సిబిఐ మాజీ డైరెక్టర్, టిఆర్‌ఎస్ నేత కె.విజయరామారావు ఆరోపించారు. త్వరలోనే వాస్తవాలను కోర్టు ముందుంచి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని ఆయన తెలిపారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన కుమారుడిపై సిబిఐ కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని అన్నారు.

02/25/2016 - 06:05

స్థానికంగా ఉండాలన్న నిబంధన సడలింపు అన్ని ఆస్పత్రుల్లో త్వరలోనే ఖాళీల భర్తీ
ప్రభుత్వాస్పత్రుల మెరుగుకు భారీగా నిధులు వైద్య శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సిఎం కెసిఆర్ సమీక్ష

02/25/2016 - 06:02

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య, వర్శిటీలో పరిణామాలపై కేంద్రం నియమించిన ఏకసభ్య కమిషన్ జస్టిస్ అశోక్ కుమార్ రూపన్‌వాలా బుధవారం నాంపల్లి గోల్డెన్ థ్రెషోల్డ్ దూర విద్యా కేంద్రం (సిడివిఎల్)లో విచారణ కొనసాగించారు. బుధవారం ఉదయం చీఫ్ ప్రోక్టార్, చీఫ్ వార్డెన్, వార్డెన్‌లు, డీన్, సమానావకాశాల సెల్ అధికారుల నుండి వాంగ్మూలాలను నమోదు చేశారు.

02/25/2016 - 05:51

హైదరాబాద్: ప్రజలకు సబ్సిడీ ధరకు నిత్యావసర సరుకులు అందాలనే సద్దుశంతో పౌరసరఫరాల శాఖ చేస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు, దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష జరిపారు.

02/25/2016 - 05:50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్సెట్ నోటిఫికేషన్‌ను జెఎన్‌టియు హైదరాబాద్ జారీ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులను 28నుండి స్వీకరిస్తారు. దరఖాస్తులను పంపించేందుకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి 28 వరకూ గడువుంది. అభ్యర్ధులు తమ డాటాలో మార్పులుంటే సవరించుకునేందుకు ఏప్రిల్ 3 నుండి 13 వరకూ గడువుంటుంది.

Pages