S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/14/2019 - 03:58

హైదరాబాద్, మే 13: ఇంటర్ పరీక్షల్లో 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా, రోడ్డు ప్రమాదాల్లో డజన్ల కొద్దీ మరణిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ అంటూ కాలయాపన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. సోమవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యార్థుల మరణాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కనీసం వాళ్లకు సంఘీభావం కూడా తెలపడం లేదని అన్నారు.

05/14/2019 - 03:57

హైదరాబాద్, మే 13: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గురుకుల పాఠశాలలు సంచలనం సృష్టించాయి. తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు టెన్త్‌లో 98.78 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 84.38 శాతం పాసయ్యారు. 498 పాఠశాలల నుండి 24,545 మంది హాజరుకాగా వారిలో 20,711 మంది పాసయ్యారు.

05/14/2019 - 03:47

హైదరాబాద్, మే 13: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (పీసీసీ) ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం సోమవారం ప్రకటించింది.

05/14/2019 - 03:46

హైదరాబాద్, మే 13: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు చేయడం ఏమిటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి నిలదీశారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగంతో కలసి ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల గోడుపట్టించుకోకుండా సీఎం విహార యాత్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

05/14/2019 - 03:45

హైదరాబాద్, మే 13: తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వచ్చే మూడురోజుల్లో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. బుధ, గురు, శుక్రవారాల్లో ఎండలు మండిపోతాయని, వడగాడ్పులు వీస్తాయని వివరించారు. గత నాలుగైదు రోజుల నుండి చిన్నపాటి వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో వాతావరణం కొద్దిగా చల్లబడ్డది. మళ్లీ ఎండలు భారీగానే ఉంటాయని హెచ్చరించారు.

05/14/2019 - 03:45

హైదరాబాద్, మే 13: ఇంటర్మీడియట్ లొల్లితో టెన్త్ ఫలితాల శాతం విపరీతంగా పెరగడం కార్పొరేట్ కాలేజీల పంట పండినట్టయింది. ఈ ఏడాది 5,06,202 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 4,67,850 మంది పాసయ్యారు. గత ఎడాది పాసైన వారి సంఖ్య కేవలం 4,20,365 మాత్రమే, అంతకు ముందు సంవత్సరం పరీక్ష పాసైన వారు కేవలం 4 లక్షలు మాత్రమే. ఉత్తీర్ణత విపరీతంగా పెరగడం ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు కలిసొచ్చింది.

05/14/2019 - 03:44

హైదరాబాద్, మే 13: ఇంటర్మీడియట్ చదివిన వారికి పలు రకాల అండర్ గ్రాడ్యూయేట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నట్టు వరల్డ్ యూనివర్శిటీ ఆఫ్ డిజైన్ వీసీ డాక్టర్ సంజయ్ గుప్త తెలిపారు. ట్రాన్స్‌పోర్టేషన్ డిజైన్, యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో డిజైన్ మేనేజిమెంట్, ప్రాక్టీస్ ఇన్ ఆర్టు తదితర విభాగాల్లో నిపుణులైన వారు తయారుచేసిన పాఠ్యాంశాలతో ఈ కోర్సులు ఉంటాయని విశ్వవిద్యాలయం వీసీ తెలిపారు.

05/13/2019 - 16:59

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఆమోదముద్ర వేసింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీరెడ్డి, వరంగల్‌కు ఇనుగుల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి స్థానానికి ఉదయ మోహన్‌రెడ్డి సోమవారంనాడు ఖరారు చేసింది.

05/13/2019 - 16:59

హైదరాబాద్: నగేశ్ ముదిరాజ్‌పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఈనెల 11 ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో మాజీ ఎంపీ వీహెచ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌కు సంబంధించిన వ్యవహారంపై గాంధీభవన్‌లో సోమవారంనాడు క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టింది. నగేశ్ ముదిరాజ్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. వీహెచ్ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వటం జరిగింది.

05/13/2019 - 16:58

హైదరాబాద్: రాబోయే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు మీదుగా తేమగాలులు వీస్తున్నాయి. దీనికితోడు ఉపరితల ఆవర్తనం వ్యాపించటంతో రాబోయే రెండు రోజుల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Pages