S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/13/2019 - 16:57

హైదరాబాద్: స్థానిక పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫర్నిచర్ దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు, దుకాణదారులు పరుగులు తీశారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతవ్వటంతో దాదాపు రూ.3కోట్ల నష్టం సంభవించినట్లు అంచనా వేశారు.

05/13/2019 - 12:47

కరీంనగర్ : జిల్లాలోని కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి ముందు నిద్రిస్తున్న చిన్నారులపైకి ట్రాక్టర్ రివర్స్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్ష్మీబాయి(7) మృతి చెందగా, రాము(7) తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం రామును ఆస్పత్రికి తరలించారు.

05/13/2019 - 12:39

హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను విద్యాశాఖా కార్యదర్శి జనార్థన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది 92.43 శాతం విజయం సాధించారు. బాలికల ఉతీర్ణత శాతం 93.68 శాతం కాగా, బాలుర ఉతీర్ణత శాతం 91.68 శాతంగా నమోదు అయింది. పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల మొదటి స్థానంలో నిలువగా, హైదరాబాద్ చివరి స్థానంలో నిలచింది.

05/13/2019 - 04:37

మహబూబ్‌నగర్, మే 12: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస అభ్యర్థుల తరఫున నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నాయకుడని తెలంగాణ తెచ్చిన గొప్పనేత అని ప్రశంసించారు.

05/13/2019 - 04:35

నల్లగొండ, మే 12: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలు అవలంబిస్తూ బలిదానాలతో తెలంగాణ తెచ్చుకున్న విద్యార్థి లోకం భవిష్యత్‌ను నాశనం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ దుయ్యబట్టారు.

05/13/2019 - 04:33

వరంగల్, మే 12: కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అయితే వరంగల్ తూర్పును వరంగల్ జిల్లాగా, వరంగల్ పశ్చిమను హన్మకొండ జిల్లాగా పేర్లు మార్చే యోచనలో ప్రభుత్వం ఉందని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం ల్యాదెళ్ల గ్రామంలో పరిషత్ ఎన్నికల సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

05/13/2019 - 04:30

యైటింక్లయిన్‌కాలనీ, వేములవాడ రూరల్, చౌటుప్పల్, మే 12: వడదెబ్బకు తెలంగాణలో ముగ్గురు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లాలో ఒకరు, సిరిసిల్ల జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొకరు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లోని 43వ డివిజన్ అల్లూరులో కోటగిరి రాజయ్య (65) వడదెబ్బ తగిలి ఆదివారం మృతి చెందాడు. రాజయ్య గీత కార్మికునిగా జీవనం కొనసాగిస్తున్నాడు.

05/13/2019 - 04:30

మునుగోడు, మే 12: మునుగోడు మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతులకు, ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మండల కేంద్రంలోని మల్లికార్జున పారబాయిల్డ్ బిన్నీ రైస్ మిల్‌లో ఈదురుగాలులకు 2 ఎల్‌వేటర్లు విరిగి పక్కనే ఉన్న గోదాంపై పడడంతో గోదాం పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో గోదాంలో ఉన్న ధాన్యం మొత్తం వానకు తడిచిపోయాయి.

05/12/2019 - 23:13

హైదరాబాద్, మే 12: తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో జంతువుల ‘దూప’ తీర్చేందుకు అటవీ శాఖ చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అమ్రాబాద్ పులుల అభయారణ్యం, నల్లమల అటవీ ప్రాంతం, ఏటూరు నాగారంలోని వన్యప్రాణి సంరక్షణాకేంద్రం, కల్వల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో అటవీ జంతువులను సంరక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకున్నది.

05/12/2019 - 23:09

హైదరాబాద్, మే 12: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ కేంద్ర కార్యాలయం ముఖ్దూం భవనంలో అఖిలపక్ష నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన పార్టీలు సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, జనసేనతో పాటు వామపక్షాల పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

Pages