S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/12/2019 - 02:34

చౌటుప్పల్, మే 11: వడదె బ్బకు శనివారం ఒక్క రోజే వృద్ధ దంపతులు సహా నలు గురు మృతి చెందారు. ఇందు లో ఒక ఉపాధిహామీ కూలీ కూడా ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వడదెబ్బకు గురై శనివారం మృతి చెందారు. గత వారం రోజులుగా భానుడి ప్ర తాపానికి ఉక్కిరిబిక్కిరైన డొప్ప నరసింహా (80) గత మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యారు.

05/12/2019 - 02:32

తిప్పర్తి, మే 11: అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందాలంటే టీఆర్‌ఎస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని మామిడాల, ఎల్లమ్మగూడెం, గోదవారిగూడెం, సిలార్మియగూడెం గ్రామాల్లో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి పర్యటించారు.

05/12/2019 - 02:28

మహబూబ్‌నగర్, మే 11: తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ హబ్‌గా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీదని టీఆర్‌ఎస్ అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబందించిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మూడవ విడత పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో తెరాస జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

05/12/2019 - 02:26

హైదరాబాద్, మే 11: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుదిదశ పోలింగ్ ఆదివారం సాయంత్రం ముగుస్తుంది. మంచిర్యాల, కొమురంబీం, భద్రాద్రి, ములుగు, జయశంకర భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం ముస్తుందని, ఇతర జిల్లాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు.

05/12/2019 - 02:25

హైదరాబాద్, మే 11: తెలంగాణలో ప్రభుత్వ పాలన గత తొమ్మిది నెలల నుండి స్తబ్దుగా కొనసాగుతోంది. వరుసగా ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కారణం. తెలంగాణ అసెంబ్లీని 2018 లో సెప్టెంబర్‌లో రద్దు చేసినప్పటి నుండి వాతావరణం అంతా ఎన్నికల చుట్టే తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి డిసెంబర్ రెండోవారం వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రహసనం కొనసాగింది.

05/11/2019 - 16:52

హైదరాబాద్: మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కనకారెడ్డి మృతపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శాసనసభ్యుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా కనకారెడ్డి 2014-18 మధ్య టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

05/11/2019 - 16:48

హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం పంపిణీ ఎంతవరకు వచ్చింది. ఇంకా ఎంతమందికి ఇవ్వాలో తెలియజేస్తూ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

05/11/2019 - 13:39

హైదరాబాద్‌ : ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించిన అఖిలపక్షాల నిరసన దీక్షలో గందరగోళం నెలకొంది.ధర్నా వేదికపై ఉన్న కుర్చీ కోసం కాంగ్రెస్‌ నేతలు కొట్టుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా కోసం సభా వేదికపై కుర్చీని ఏర్పాటు చేశారు. ఈ కుర్చీపై అదే పార్టీకి చెందిన నాయకుడు గజ్జెల నగేశ్‌ కూర్చున్నారు. దీంతో నగేశ్‌ను సీనియర్‌ నాయకులు వీ. హనుమంతరావు ప్రశ్నిస్తూ..

05/11/2019 - 13:36

హైదరాబాద్‌ : తెలంగాణ ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ప్రశ్న పత్రాలు, ప్రాథమిక సమాధానాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ‘కీ’పై అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఎంసెట్‌ కన్వీనర్‌ సూచించారు. ఈనెల 13 సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు.

05/11/2019 - 00:39

ఆదిలాబాద్, మే 10: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల ఘట్టం స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో ఈసారి భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసి సీసీ కెమెరాల మధ్య నిఘా పెంచారు.

Pages