S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/12/2019 - 23:00

హైదరాబాద్, మే 13: తెలంగాణలో ప్రభుత్వ పాలన గత తొమ్మిది నెలల నుండి స్తబ్దుగా కొనసాగుతోంది. వరుసగా ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కారణం. తెలంగాణ అసెంబ్లీని 2018లో సెప్టెంబర్‌లో రద్దు చేసినప్పటి నుండి వాతావరణం అంతా ఎన్నికల చుట్టే తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి డిసెంబర్ రెండోవారం వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రహసనం కొనసాగింది.

05/12/2019 - 22:59

హైదరాబాద్, మే 12: వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు అమాంతంగా పెరిగిపోవడంతో హైదరాబాద్ నగరవాసులు విద్యుత్‌ను తెగ వాడేస్తున్నారు. తెలంగాణలో ఆదివారం రోజు విద్యుత్ వినియోగం దాదాపు 6414 మెగావాట్లకు చేరుకుంది. ఒక్క హైదరాబాద్‌లో ఆదివారం జంటనగర వాసులు వాడిన విద్యుత్ గణాంకాలు పరిశీలిస్తే దాదాపు 3వేల మెగావాట్లు వినియోగించినట్లు లెక్కలు చెబుతున్నాయి.

05/12/2019 - 22:58

హైదరాబాద్, మే 12: సరళీకృత వాణిజ్య విధానాల (ఈవోడీబీ) కింద ఈ ఏడాది అగ్రస్థానం పొందాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వివిధశాఖల్లో సంస్కరణలను వేగవంతం చేసింది. ప్రపంచ బ్యాంకు, డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ఆఫ్ ది సెంటర్ ఉమ్మడిగా ఈవోడీబీ ర్యాంకును ప్రకిటిస్తాయి.

05/12/2019 - 22:58

హైదరాబాద్, మే 12: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతల్లో కోతులు, కొండెంగులు తదితర అడవి జంతువులు రైతు ఆవాసాలతో పాటు పంట పొలాలను సర్వ నాశనం చేస్తన్నాయని, వాటి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఆదివారం లేఖలోని అంశాలను ఆయన మీడియాకు విడుదల చేశారు.

,
05/12/2019 - 04:12

కాచిగూడ, మే 11: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని పలువురు వక్తలు అరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష శనివారం నగరంలోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియా మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని విమర్శించారు.

05/12/2019 - 04:02

హైదరాబాద్, మే 11: నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వౌలిక సదుపాయలు లేక నరకయాతన పడుతున్నారు. నైట్‌అవుట్ డ్యూ టీ డ్రైవర్లు, కండక్టర్లు బసచేసే ప్రాంతంలో కనీస సదుపాయాలైన మరుగుదొడ్లు, స్నానాల గదు లు, నిద్రించేందుకు సరిపడా స్థలం లేక అవస్థలు పడుతున్నారు.

05/12/2019 - 04:00

హైదరాబాద్, మే 11: మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత చింతల కనకారెడ్డి మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుమపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రైతు కుటుంబానికి చెందిన కనకారెడ్డి ద్రాక్ష రైతుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు.

05/12/2019 - 03:58

హైదరాబాద్, మే 11: ఐసెట్ రాస్తున్న వారికి పూర్తి అవగాహన కల్పించే ఉద్ధేశ్యంతో ఉచితంగా ఆన్‌లైన్ మాక్ టెస్టును ఈ నెల 12న నిర్వహిస్తున్నట్టు ఆర్‌జీ కేడియా కాలేజీ డైరెక్టర్ డాక్టర్ డీవీజీ కృష్ణ తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ 12వ తేదీ ఉదయం 10 గంటల వరకూ కొనసాగుతుందని ఆయన చెప్పారు. పరీక్ష ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని, సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.

05/12/2019 - 03:57

హైదరాబాద్, మే 11: నైపుణ్యం లేనిదే న్యాయవాద వృత్తిలో రాణించలేరని, కొత్తగా న్యాయవాదులైన వారంతా విషయపరిజ్ఞానంతో , చట్టాలపై అవగాహనతో తమ వాదనలను వినిపించాలని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలన్నా నైపుణ్యత అవసరమన్నారు.

05/12/2019 - 03:56

హైదరాబాద్, మే 11: ఇంజనీరింగ్ యూజీ కోర్సులో నేరుగా రెండో సంవత్సరంలో చేరేందుకు వీలు కల్పించే ఈసెట్ ప్రవేశపరీక్షను శనివారం నాడు విజయవంతగా నిర్వహించినట్టు కన్వీనర్ డాక్టర్ ఏ గోవర్థన్ చెప్పారు.

Pages