S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/30/2018 - 05:38

హైదరాబాద్, అక్టోబర్ 29: క్రైస్తవులపై టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. డిసెంబర్ 12న రాష్ట్రంలో ఏసు క్రీస్తు కోరుకున్న ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైయ్యేంత వరకు తాను నిద్ర పోనని, మిమ్మల్లి నిద్ర పోనివ్వనని అన్నారు. అఖిల భారత క్రిస్టియన్ ఫెడరేషన్ సోమవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉత్తమ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

10/30/2018 - 05:36

హైదరాబాద్, అక్టోబర్ 29: మహిళల రక్షణకు కఠిన చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకుని వ్యవహరించాలని జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు లలిత కుమార మంగళం పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌క్లూజివ్ గవర్నెన్స్, రాంబావు మల్గీ ప్రబోధిని సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

10/30/2018 - 05:34

హైదరాబాద్, అక్టోబర్ 29: మహాకూటమి సర్దుబాటు ఎవరూ ఊహించని రీతిలో కొలిక్కి రావడంతో నవంబర్ 1న తొలి జాబితాను ప్రకటించనున్నట్టు కూటమి నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలపై నేతలు ఇప్పటికే అనధికారిక జాబితాను విడుదల చేశారు.

10/30/2018 - 05:33

హైదరాబాద్, అక్టోబర్ 29: రాష్ట్ర ప్రజలను కంటి వెలుగులో పరీక్షలు చేయించుకోమని అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చెప్పి తాను మాత్రం ఢిల్లీలో కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆసుపత్రి అని కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళారని మధుయాష్కీ గౌడ్ సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

10/30/2018 - 05:33

హైదరాబాద్, అక్టోబర్ 29: ఎన్నికల సందర్భంగా ప్రజలకు మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్న రాజకీయ పార్టీలు, నేతలపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కోరారు.

10/30/2018 - 05:32

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులుగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు రూపొందించిన ప్రణాళికను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించారు.

10/30/2018 - 05:30

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణలోని సీమాంద్ర ప్రజలకు తాను అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపిన హైదరాబాద్‌లోని సీమాంద్ర ఓటర్లు, ప్రస్తుతం వారు టీఆర్‌ఎస్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నట్టు తాజా మాజీ సెటిలర్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

10/30/2018 - 05:29

హైదరాబాద్, అక్టోబర్ 29: రైతులకు నాణ్యమైన విత్తనం అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు ఆర్గానిక్ సర్ట్ఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, విత్తనోత్పత్తి అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందన్నారు.

10/30/2018 - 05:07

నిజామాబాద్, అక్టోబర్ 29: నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గత జూలై 1వ తేదీన బాబ్లీకి చెందిన 14 గేట్లను పైకి ఎత్తగా, తిరిగి ప్రస్తుతం వాటిని మూసివేసి గోదావరి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు.

10/30/2018 - 05:05

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 29: ఎన్నికల సమయంలో ఒకపక్క ప్రచారం చేస్తూనే.. మరోపక్క ప్రలోభాలకు గురి చేయడమనేది సర్వసాధారణంగా జరిగేదే. జాతీయ ఎన్నికల కమిషన్ నియామవళిని రూపొందించి ఎన్నికల సమయంలో అమలుచేస్తున్నప్పటికీ, అభ్యర్థుల్లో చాలామంది వాటిని ఉల్లంఘిస్తూనే ఉండటం రివాజుగా మారింది.

Pages