S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/30/2018 - 04:57

రేగోడ్, అక్టోబర్ 29: టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను సీఎంను చేసేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి, అబద్దాలు చెబుతున్నాడని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ధ్వజమెత్తారు. మోసకారి కేసీఆర్ మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

10/30/2018 - 04:55

వేములవాడ, అక్టోబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక, మొదటిసారి ఏర్పడిన తెరాస ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేస్తూ మైనార్టీ ప్రజల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోందని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం సిరిసిల్ల రాజన్న జిల్లా పరిధిలోని వేములవాడలో నియోజకవర్గ స్థాయి మైనార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు.

10/30/2018 - 04:53

ధర్మపురి, అక్టోబర్ 29: ధర్మపురిలో ఆంధ్రా పోలీసులు సంచరించారని ప్రచారం చేసిన సంఘటనకు రాజకీయ రంగు పులిమి, మసిపూసి మారేడుకాయ చేసి, సంచలనంగా మార్చిన సంఘటనలో పోలీసు అధికారులు జరిపిన విచారణలో తేలిందేమిటనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.

10/30/2018 - 05:41

హైదరాబాద్, అక్టోబర్ 29: సెటిలర్స్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ హర్ట్ చేయలేదని, మహాకూటమి నేతలే వారిలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది. తెలంగాణలో సీమాంద్ర ప్రజలకు భవిష్యత్‌లో కూడా అండగా నిలుస్తామని భరోసా కల్పించడానికే మంత్రి కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారని టీఆర్‌ఎస్ స్పష్టం చేసింది.

10/30/2018 - 04:48

హైదరాబాద్, అక్టోబర్ 29: మెదడుకు సంబంధించిన జ్ఞాన వికాసానికే పరిమితం కాకుండా జాతీయ నూతన విద్యా విధానంలో మహాత్మాగాంధీ సూచించిన నయి తాలిం- మెదడు, మనస్సు, శరీరం లగ్నం కావాలనే విధానాలను చేర్చాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కోరినట్టు ఎన్‌సీఈఆర్‌టీ సభ్యుడు పి మురళీ మనోహర్ చెప్పారు.

10/29/2018 - 12:49

హైదరాబాద్: రోడ్డు దాటుతున్న కళాశాల విద్యార్థినిని బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన కూకట్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్టకు చెందిన రమ్య కూకట్‌పల్లిలోని చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతుంది. కాలేజీ బస్సు దిగి రోడ్డు దాటుతుండగా అదే కళాశాలకు చెందిన బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందింది.

10/29/2018 - 04:26

కామారెడ్డి, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆదాయంతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నిజంగానే బంగారు తెలంగాణ చేస్తాడని అనుకున్నాని, కాని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చేసి, ప్రజాధనం వృధా చేశారని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ ఆరోపించారు.

10/29/2018 - 04:32

సిద్దిపేట: టీఆర్‌ఎస్ చేపట్టిన ప్రతి సంక్షేమం, అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తానంటోందని.. ప్రతి దానిని వద్దు... రద్దు అంటున్న కాంగ్రెస్ పార్టీని.. ఇక్కడి నుండి రద్దు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.

10/29/2018 - 04:18

సూర్యాపేట రూరల్, అక్టోబర్ 28: దశాబ్దాలుగా నిరాదరణకు గురైన గిరిజనులకు ఆత్మగౌరవం కల్పించేలా గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని లక్ష్మీతండా, రాజ్‌నాయక్‌తండా గ్రామాల్లో ఆదివారం జరిగిన ప్రైవేటు కార్యక్రమాలకు హజరయ్యారు.

10/29/2018 - 04:16

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 28: రాబోయే ఎన్నికలలో అధికార పార్టీ నేతలు పోలీస్ ఇంటలిజెన్స్ సహకారంతో గ్రామాలలో డబ్బుల పంపిణీకి ఇప్పటి నుంచే పన్నాగాలు పన్నుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

Pages