S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/29/2018 - 04:14

నల్లగొండ, అక్టోబర్ 28: మహాకూటమి పార్టీల్లో నెలకొన్న సీట్ల కేటాయింపు కిరికిరితో కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ నాయకత్వాలు సతమతమవుతున్నాయి. సీట్ల కేటాయింపులు, సర్ధుబాట్ల వ్యవహారం చూడాల్సిన కూటమి పెద్దన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ స్థానాల్లో కనీసం మూడు నుండి నాలుగు సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో కాంగ్రెస్ ఆశావహుల్లో నైరాశ్యం మొదలైంది.

10/29/2018 - 04:13

వరంగల్, అక్టోబర్ 28: తెలంగాణలో ఎట్టి పరిస్థితిలోనైన అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై ఆపార్టీ ఆశావాహులు నీళ్లు చల్లబోతున్నారా? వీళ్లంతా కలిసి కుంపటిలో, వేరు కుంపటి పెట్టాబోతున్నారా? మహాకూటమి తరహా మరో కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

10/29/2018 - 04:04

హైదరాబాద్, అక్టోబర్ 28: గతంలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీస్ బలగాల మోహరింపుతో పాటు వేలాదిమంది కేంద్ర, రాష్ట్ర బలగాలు కవాతు నిర్వహించాయ. దీంతో పాత బస్తీలో నిషేధ ఉత్తర్వులు (కర్ఫ్యూ వాతావరణం ) అమలు అవుతున్నాయన్న సంఘటనలను స్థానికులు గుర్తు చేసుకున్నారు. పాత నగరంలో ఉన్న సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాలు ఫ్లాగ్‌మార్చు ప్రదర్శనలు చేపట్టారు.

10/29/2018 - 03:59

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణకు సుస్థిర సీఎం కేసీఆర్ కావాలా? సీల్డ్ కవర్ సీఎం కావాలో? ఆలోచించుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తిరిగి కేసీఆరే సీఎం అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎంత మంది సీఎంలు మారారో మర్చిపోలేమన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మర్వాడీ సమాజ్, అగర్వాల్ సమాజ్, జైన్ సమాజ్ నేతలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

10/29/2018 - 03:58

హైదరాబాద్, అక్టోబర్ 28: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇతర పార్టీల్లోకి ఫిరాయింపుల ప్రక్రియ మొదలైయిందని, నామినేషన్ ఘట్టం చివరికి తెరాస పార్టీ ఖాళీ కావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం నాడు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పై విధంగా పేర్కొన్నారు.

10/29/2018 - 03:56

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగాలు లభించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శించారు.

10/28/2018 - 23:46

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పంటల కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. పెసళ్ల ధరలు మార్కెట్‌లో తక్కువగా ఉండటంతో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి క్వింటాల్‌కు నిర్ణయించిన కనీస మద్దతు ధర అయిన 6975 రూపాయలకు రైతులకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 85.30 కోట్ల రూపాయల విలువైన 2291 టన్నుల పెసళ్లను కొనుగోలు చేశారు.

10/28/2018 - 23:43

హైదరాబాద్, అక్టోబర్ 28: ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ప్రజలతో మమేకం అయి వారి అభిరుచికి తగ్గట్టు పరిపాలనలో మెలకువలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య పేర్కొన్నారు.

10/28/2018 - 04:44

హైదరాబాద్, అక్టోబర్ 27: కృష్ణా , పెన్నా నదులను అనుసంధానం చేస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఆంధ్రా , తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ పాలనే సాగుతోందని ఆయన విమర్శించారు.

10/28/2018 - 04:41

హైదరాబాద్, అక్టోబర్ 27: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒకే అబద్దాన్ని పదే పదే వల్లిస్తున్నారని అది నిజం అవుతుందనే భ్రమలో ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆయన పిచ్చివాళ్ల స్వర్గంలో విహరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు దత్తాత్రేయ శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.

Pages