S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/08/2020 - 01:51

రాజేంద్రనగర్, జనవరి 7: హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్)లో వ్యవసాయ పరిశోధన సేవ కోసం 110వ ఫౌండేషన్ కోర్సును తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.

01/08/2020 - 01:48

హైదరాబాద్, జనవరి 7: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కామన్ మేనిఫెస్టో తయారు చేయాలని నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అయితే స్థానిక అంశాల వారీ విధిగా లోకల్ మేనిఫెస్టోను రూపొందించుకోవల్సిందిగా ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహరచనకు బుధవారం నాడు అన్ని మున్సిపాల్టీల్లో స్థానిక సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

01/08/2020 - 01:43

హైదరాబాద్, జనవరి 7: రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల క్లర్కుల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నియమనిబంధనలను జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జీవో ఇస్తూ 2019 జనవరి 1వ తేదీ నుండి దీనిని అమలులోకి తెచ్చినట్టు పేర్కొంది.

01/08/2020 - 01:42

హైదరాబాద్, జనవరి 7: భారత్‌లో ఉన్న ప్రజలందరూ హిందువులే అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై తక్షణమే కేసు నమోదు చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు పోలీసులను డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఎల్‌బీ నగర్ పీఎస్‌కు వెళ్లి పోలీసు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ చౌకీదార్ చోర్ అన్నందుకు రాహుల్ గాంధీపై పోలీసులు కేసులు పెట్టారన్నారు.

01/08/2020 - 01:11

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైనా తేడా వస్తే మంత్రి పదవులు ఊడుతాయంటూ టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన హెచ్చరికతో మంత్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో మినహా మిగతా పంచాయతీ, పరిషత్, జిల్లా పరిషత్ అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ తిరుగులేని అధిపత్యాన్ని కొనసాగించింది.

01/08/2020 - 01:10

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మంగళవారం సాయంత్రం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ నోటిఫికేషన్‌లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను తొలగించారు.

01/07/2020 - 05:19

'చిత్రం... తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఐటీ మంత్రి కేటీఆర్ కుటుంబం సభ్యులు

01/07/2020 - 05:06

కరీంనగర్ టౌన్, జనవరి 6: పౌరసత్వ సవరణ చట్టం అమలును పార్లమెంటులో వ్యతిరేకించిన టీఆర్‌ఎస్ ఎంపీలు రాష్ట్రంలో కొనసాగుతున్న నిరసనలకు మద్దతు తెలపకపోవటం వెనుక ఆంతర్యమేంటని? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సోమవారం నగరంలోని బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఏఏపై కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

01/07/2020 - 05:06

యాదగిరిగుట్ట, జనవరి 6: నిత్యం తన దర్శనం కోసం వచ్చే భక్తుడి కోసం భగవంతుడే కదిలివచ్చి ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనమివ్వగా భక్తకోటి వైకుంఠ ద్వార దర్శనంతో పులకించింది. ఉషోదయపు మంచుతెరల మధ్య వైకుంఠ ద్వార దర్శనమిచ్చిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో తన్మయులయ్యారు.

01/07/2020 - 01:04

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ (డీఐపీ) ఫార్మాసిటీని నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చర్ జోన్‌గా గుర్తించినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం

Pages