S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/19/2018 - 00:58

హైదరాబాద్, మే 18: వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు గాను భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ)తో ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుంది. వ్యవసాయాభివృద్ధికి అవసరమైన శాస్త్ర, సాంకేతిక, వౌళిక సదుపాయాల సహకారం పొందేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

05/19/2018 - 00:58

హైదరాబాద్, మే 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు. రిటైర్డు ఐఏఎస్ అధికారి సిఆర్ బిస్వాల్ చైర్మన్‌గా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ, సభ్యులుగా రిటైర్డు ఐఏఎస్ అధికారులు సి ఉమామహేశ్వర్‌రావు, డాక్టర్ మహమద్ ఆలీ రఫత్‌ను నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

05/19/2018 - 00:57

హైదరాబాద్, మే 18: సాగునీటి శాఖలో 295 మంది ఇంజనీర్ల నియామకం పూర్తి అయింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కోటి ఏకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. దీంతో ఈ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. గతంలో రెండు పర్యాయాలు టీపీఎస్సీ ద్వారా నియామకాలు పూర్తి చేసిన ప్రభుత్వం ఇటీవల మూడో సారి నియామక ప్రక్రియ చేపట్టింది.

05/19/2018 - 00:56

హైదరాబాద్, మే 18: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణాలో చేపడుతున్న వివిధ భారీ ప్రాజెక్టులపై ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు తెలంగాణా అధికారులతో చర్చలు జరిపారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ ఎస్‌కె జోషి నేతృత్వంలో తెలంగాణాలో జాతీయ రహదారులు విస్తరణ, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, హైదరాబాద్ మెట్రో, సింగరేణికి సంబంధించిన పనులపై ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులకు సిఎస్ వివరించారు.

05/18/2018 - 02:58

ముస్తాబాద్, మే 17: ప్రజల సంక్షేమం కోసం ఏ పథకం అమలు చేసినా ఓట్ల కోసమని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్, గూడెం గ్రామాల్లో గురువారం రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుబుక్కుల పంపిణీని సందర్భంగా ప్రసంగించారు.

05/18/2018 - 02:55

సిద్దిపేట, మే 17: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతులు బాగుపడితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహామూద్ అలీ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని, వారి బాగోగులను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసమే 12వేల కోట్ల రూపాయలతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

05/18/2018 - 02:53

ఆదిలాబాద్,మే 17: రాబోయే ఎన్నికల్లో బహుజన లెప్ట్ ఫ్రంట్ పార్టీ రాజ్యాధికారమే లక్ష్యంగా 65శాతం బీసీ వర్గాలకు టికెట్లు ఖరారు చేయనుందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

05/18/2018 - 02:48

నల్లగొండ, మే 17: సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే నాలుగేళ్ల క్రితమే రైతుబంధు పథకం తెచ్చేవారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలువదని తెలిసే ఇప్పుడు రైతుబంధు పథకం తీసుకొచ్చారని సీఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

05/18/2018 - 02:45

మహబూబాబాద్, మే 17: భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా భూరికార్డులు ప్రక్షాళన చేసి పెట్టుబడికి నగదు సాయాన్ని అందించి చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.

05/18/2018 - 02:32

హైదరాబాద్, మే 17: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు ఈ నెల 19 నుంచి జూలై 18 వరకు నిషేధం విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. తెలంగాణ, ఎపి సచివాలయాలకు 3 కిలోమీటర్ల దూరం వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్ పోలీస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Pages