S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

01/04/2018 - 19:42

హెచ్‌ఎండి గ్లోబల్’ ద్వారా స్మార్ట్ఫోన్ మార్కెట్‌లోకి నోకియా సరికొత్తగా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ ప్రేమికుల్లో నోకియా సరికొత్త ఆశలను రేకెత్తించింది. నోకియా బ్రాండ్‌కు సంబంధించి బడ్జెట్, ప్రీమియం సెగ్మెంట్లలో పలు స్మార్ట్ఫోన్లు ఇదివరకే మార్కెట్‌లోకి వచ్చి సత్తాచాటాయి. ఈ కొత్త సంవత్సరంలోనూ అదే ఊపును కొనసాగించేందుకు నోకియా సిద్ధమైంది.

12/28/2017 - 20:05

మరో రెండురోజుల్లో అదృశ్యం కాబోతున్న 2017లో వివిధ రంగాల్లో కొంతమంది తమ హవా నిరూపించుకుని యువతను విశేషంగా ఆకట్టుకున్నారు. సినిమాలు, క్రీడలు, ఫ్యాషన్, స్మార్ట్ఫోన్లు, అందాల పోటీలు, సామాజిక మీడియా.. ఇలా అనేకానేక అంశాల్లో కొత్త పోకడలు యువతరాన్ని అలరించాయి.. కొందరు సెలబ్రిటీలు, కొన్ని ట్రెండ్స్ పట్ల యువతలో మోజు కనిపించింది.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లు సాక్షాత్కరిస్తాయి..

12/28/2017 - 20:00

ఒకప్పుడు సందేశాలను పావురాలు మోసుకొచ్చేవి. ఇపుడు తాజావార్తలను అందించేందుకు ‘బుల్లిపిట్ట’ (ట్విట్టర్) రెడీ అయింది. వార్తల కోసం స్మార్ట్ఫోన్లను ఆశ్రయించే వారి కోసం ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ‘ట్విట్టర్’ తాజా వార్తలను అందించే సేవలను ప్రారంభించింది. ‘బ్లూమ్‌బర్గ్’ మీడియా సౌజన్యంతో విశ్వవ్యాప్త న్యూస్ నెట్‌వర్క్‌ను ‘ట్విట్టర్’ అందుబాటులోకి తెచ్చింది.

12/28/2017 - 19:59

ఫేస్‌బుక్‌కు అనుబంధంగా వున్న ఫొటో సందేశాల వేదిక ‘ఇన్‌స్టాగ్రామ్’ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల వచ్చిన ఎన్నో డైరెక్ట్ ఫీచర్లు ఇన్‌స్టాగ్రామ్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికీ ఇపుడు అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజింగ్ కోసం తనదైన ఒక యాప్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది.

12/28/2017 - 19:55

నోట్స్ రాసుకునేందుకు వీలుగా 6.3 అంగుళాల స్క్రీన్‌పై శామ్‌సంగ్ గెలాక్సీ నోట్-8 రకం స్మార్ట్ఫోన్ మార్కెట్‌లోకి విడుదలైంది. ‘ఎస్ పెన్‌తో’ బెజెల్ లెస్ డిస్ ప్లేని నోట్‌బుక్ మాదిరి వాడుకునే సౌకర్యం ఇందులో ఉంది. 67,800 రూపాయలుగా ధరను నిర్ణయించిన ఈ ఫోన్‌లో వెనుక భాగాన 12 మెగాపిక్సెల్ ‘జంట కెమెరాలు’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

12/28/2017 - 19:54

చైనాకు చెందిన ప్రఖ్యాత సంస్థ హవాయి మరో విలక్షణమైన స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఆనర్-9 పేరుతో ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారతీయ మార్కెట్‌లో రంగప్రవేశం చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. 3, 4 జిబి ర్యామ్‌లలో విడుదలకాబోతున్న ఈ ఫోన్ ధరలను రూ.14,590, రూ. 17,500లుగా నిర్ణయించారు.

12/28/2017 - 19:53

స్మార్ట్ఫోన్ టచ్ స్క్రీన్ వలే పనిచేస్తూ 13.3 అంగుళాల తెరతో అందరినీ కట్టిపడేసేలా మార్కెట్‌లోకి రంగప్రవేశం చేసింది- ‘డెల్ ఎక్స్‌పిఎస్ 13’ ల్యాప్‌టాప్. హై రిజల్యూషన్‌తో పనిచేసే ఈ ల్యాపీని అల్యూమినియం ప్లేట్‌తో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 1.2 కిలోల బరువుండే ఈ ల్యాప్‌టాప్ ధరను రూ. 91,990లుగా నిర్ణయించారు. 12 నుంచి 14 గంటల సేపు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండడం ఇందులోని మరో విశిష్టత.

12/28/2017 - 19:51

స్మార్ట్ఫోన్ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ‘10-ఆర్’ పేరుతో కొత్తరకం మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ‘10-ఆర్’ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు జనవరి 5 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలియగానే అపుడే వినియోగదారుల్లో ఆసక్తి మొదలైంది. ఈ ఫోన్‌లోని ప్రత్యేకతలు వినియోగదారులను అలరించేలా ఉంటాయని ‘అమెజాన్’ చెబుతోంది.

12/28/2017 - 19:50

చైనాకు చెందిన ఒప్పో కంపెనీ ఎ-83 పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్‌ను విడుదల చేసింది. కొద్ది రోజుల్లో భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో 18.9 ఫుల్ విజన్ డిస్‌ప్లే, ఫేసియల్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో దీని ధర రూ.13,700 గా ఉంటుందని అంచనా. ఇందులోని విశిష్టతలు...

12/21/2017 - 20:00

సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమా ‘రాణి’ అంటే ఆమెకు తెగ ఇష్టం.. ఆ సినిమాలో కీలకపాత్రలో మెప్పించి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కంగనా రనౌత్ అన్నా మరీ ఇష్టం.. కంగనాకు, తనకు ఎన్నో పోలికలున్నాయని సన్నిహితులు చెబుతుంటే ఆమెకు ఎంతో సంతోషం.. ‘రాణి’ సినిమా సంగతిని పక్కన పెడితే- ఆమె మాత్రం ‘చదరంగ సామ్రాజ్యాని’కి మకుటం లేని మహారాణిలా జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

Pages