S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెద్ద నోట్ల రద్దుతో పేదల ఇక్కట్లు

ఖైరతాబాద్, నవంబర్ 17: నల్లధనాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఏ మేరకు సత్పలితాలను ఇస్తుందో తెలియదు కానీ పేద, సామాన్య ప్రజలు నానా ఇక్కట్లకు గురిచేస్తుంది. ఈనెల 8న ప్రదాని నరేంద్ర మోదీ ఎనిమిది గంటల సమయంలో రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకటన వెలువడిన మరు క్షణం నుంచి పెద్ద డినామినేషన్ కలిగిన నోట్లను తీసుకునేందుకు అన్ని వర్గాల వారు నిరాకరించడంతో సమస్యలు ప్రారంభం అయ్యాయి. వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పరిస్థితి అత్యంత దుర్బరంగా తయారైంది. ఒక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు రోజుల తరబడి ప్రాయాణించే లారీ డ్రైవర్లు, క్లీనర్లు తిండి కోసం తీవ్రంగా తపించారు.
లారీ ఖర్చుల నిమిత్తం భారీ మొత్తంలో తమ వద్ద డబ్బు ఉన్నా దానిని ఖర్చు చేయలేకుండా ఉన్నామని ఆకలి దంచుతుందని చెప్పడం ఈ సమస్య తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. దీంతో పాటు వైద్యం కోసం నగరాలు, పట్టణాలకు వచ్చినవారు తంటాలు పడుతున్నారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బు, ఆరోగ్యశ్రీ కార్డు చేతులో పట్టుకొని వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం ఖర్చుల కోసం తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును డ్రా చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా పోయిందని కన్నీరు పెడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోని బందువులు తమ ఖాతాల్లో డబ్బు వేసేందుకు సైతం అవకాశం లేకుండా చేశారు. తమ వద్ద పెద్ద నోట్లనైతే ఆసుపత్రి కౌంటర్‌లో చెల్లించినా తిండి, ఇతర అవరాలను ఎలా తీర్చుకోవాలని నిట్టూరుస్తున్నారు. వైద్యం పూర్తి అయినా డబ్బు చెల్లించలేదని డిశ్చార్జ్ చేయకపోవడంతో రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంటున్నారు కొంత మంది. దీంతో రోగి, అతని సహాయకుల సహనానికి పరీక్ష పెడుతుంది. వీటన్నింటికి తోడు జీవితంలో మరిచి పోలేని విధంగా ఉన్నంతలో సంతోషంగా వివాహ వేడుక జరుపుకుందామని భావించిన వారికి పెళ్లి మీదే విరక్తి కలిగేలా చేసింది. పిల్లలు, పెద్దలతో కళకళలాడాల్సిన పెళ్లి ఇండ్లలో నిశ్శబద్దం నెలకొంటుంది. పెళ్లికి సిద్ధమైన వధువు, వరుడితో పాటు కుటుంబ సభ్యులు, బందువులందరూ బ్యాంకుల ముందు నోట్ల కోసం క్యూలో నిలబడుతున్నారు. అదృష్టం బాగుంటే నగదుతో తిరిగి వస్తున్నారు. బ్యాంకులు, ఏటిఎంలలో నగదు నిండుకుంటే వాలిపోయిన ముఖాలతో తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు సగానికిపైగా పడిపోగా, హోటళ్లు, సినిమా హాళ్ల పరిస్థితి చెప్పలేనంత మారిపోయింది. ఎవరి చేతిలో నగదు లేకపోవడంతో అడ్డాకూలీలు పూటగడవడం మహాకష్టంగా మారింది. నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడే ఖైరతాబాద్, లక్డీకపూల్, సికింద్రాబాద్, బేగంపేట్, కోఠి వంటి ప్రాంతాల్లో సైతం ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుంది.
రద్దీలోనూ క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు
నల్లధనాన్ని నిర్మూలించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సైతం వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.