S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాగేందర్‌రెడ్డిపై కాల్పులు జరిపిన నిందితుడికి రిమాండ్

జీడిమెట్ల, నవంబర్ 17: పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల కలకలం కేసులో ఓ నిందితుడిని అరెస్టు చేసి మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్ తెలిపారు. గురువారం సాయంత్రం పేట్‌బషీరాబాద్ పిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి, ఎసిపి అశోక్‌కుమార్, సిఐ డివి రంగారెడ్డితో కలిసి కాల్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసిపి తెలిపిన వివరాల ప్రకారం కుత్భుల్లాపూర్ సర్కిల్ బాపునగర్ కాలనీ నివాసి అయిన మందడి నాగేందర్‌రెడ్డి(29) పద్మనగర్ నివాసి చక్రవర్తితో కలిసి కొంత కాలం క్రితం స్థిరాస్తి (రియల్‌స్టేట్) వ్యాపారం చేసేవారు. వ్యాపార లావాదేవీల క్రమంలో చక్రవర్తి ప్రవర్తన నచ్చకపోవడంతో నాగేందర్‌రెడ్డి.. చక్రవర్తికి దూరంగా ఉంటున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న చక్రవర్తి.. నాగేంర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2015లో సర్వే నంబర్ 102 పద్మనగర్ ఫేస్-2లోని ప్లాట్ నంబర్ 341లోని 300 గజాల స్థలాన్ని చక్రవర్తి ఆదేశాల మేరకు చింతల్ ప్రాంతం చంద్రగిరినగర్ కాలనీకి చెందిన కేదారిప్రభుదేవ్ అలియాస్ సాయి ప్రభు(25) మరికొందరితో కలిసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న నాగేందర్‌రెడ్డి సదరు ప్లాట్ యాజమాని తమిళనాడు చెన్నై బాలాజీనగర్‌కు చెందిన టివి నర్సింహ్మరావుకు తెలిపాడు. తన ప్లాట్ కబ్జాకు గురైన విషయాన్ని టివి నర్సింహ్మరావు పేట్‌బషీరాబాద్ పిఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు కబ్జాదారులపై లాండ్‌గ్రాబింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో కేదారి ప్రభుదేవ్ అలియాస్ తేజ అలియాస్ సాయిప్రభు, లలితజ్యోతి, అమృతపై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. దీంతో అప్పటి నుండి నాగేందర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో కక్ష పెంచుకున్న చక్రవర్తి ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం రూపొందించాడు. రెండు నెలల క్రితం చక్రవర్తి లక్ష రూపాయలను కేదారి ప్రభుదేవ్‌కు ఇవ్వగా అందులో రూ.40 వేలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ ప్రాంతానికి వెళ్లి అక్కడ నుండి ఓ ఆటోమెటిక్ పిస్టల్ (ఐదు రౌండ్లది) కొనుగోలు చేసి తిరిగి ఇక్కడి చేరుకున్నాడు. అదును చూసి నాగేందర్‌రెడ్డిని హతమార్చాలని పథకం రచించారు. కాగా ఈనెల 15న చక్రవర్తి, రాజశేఖర్‌రెడ్డి.. కేదారి ప్రభుదేవ్‌ను పిలిపించి 16వ తేదీన నాగేందర్‌రెడ్డిని చంపమని ఆదేశించారు. 16వ తేదీ సాయంత్రం నాగేందర్‌రెడిడ్డి చింతల్ ప్రాంతంలోని తన అత్తగారి ఇంటికి వెళ్లి తన భార్యను తీసుకుని రాత్రి 10 గంటల ప్రాంతంలో తన ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్లే సమయంలో అప్పటికే అక్కడ పస్టిల్‌తో మాటువేసిన కేదారి ప్రభుదేవ్ రెండు రౌండ్‌లు కాల్పులు జరిపాడు. అందులో ఒక బుల్లెట్ నాగేందర్‌రెడ్డి శరీరంలోకి దూసుకెళ్లగా మరో రౌండ్ బుల్లెట్ గాలిలోకి వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు కేదారి ప్రభుదేవ్‌ను పట్టుకుని దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన నాగేందర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నిందితుడు కేదారి ప్రభుదేవ్‌ను అరెస్టు చేసి పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు డిసిపి పేర్కొన్నారు. పరారీలో ఉన్న సూత్రదారులు చక్రవర్తి, రాజశేఖర్‌రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు.