S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వచ్ఛ భారత్ మిషన్

హైదరాబాద్, నవంబర్ 17: మహానగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా నగరంలోని 45 వార్డులను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత వార్డులుగా జిహెచ్‌ఎంసి ప్రకటించింది. మరో 112 వార్డులను కూడా డిసెంబర్ చివరి కల్లా ప్రకటించటానికి జిహెచ్‌ఎంసి సన్నద్దమవుతోంది. కాలనీ సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు విద్యార్ధినీ, విద్యార్ధులను భాగస్వామ్యం చేస్తున్నారు. స్వచ్ఛ భారతణ మిషన్ మార్గదర్శకాలను అనుసరించి నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను ప్రతి 15 రోజులకు ఓసారి 30 సర్కళ్లలో నిర్వహిస్తున్నారు. నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దటానికి నరగంలో ఉన్న 1139 పాఠశాల విద్యార్ధినీ, విద్యార్ధులను భాగస్వామ్యం చేస్తూవారితో నవంబర్ 14న ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించిన విషయం తెలిసిందే. నగరంలోని 2345 స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులతో పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేయటం , తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుత్తం ప్రకటించిన 45వార్డుల్లోని అన్ని గృహాలకు విధిగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లేదా ఆయా కాలనీలలో కమ్యూనిటీ టాయిలెట్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎవరైనా బహిరంగా మలమూత్ర విసర్జన జరిపితే ప్రత్యేకంగా జరిమానా విధించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. తమ వార్డులు ఓడిఎఫ్‌గా ప్రకటిస్తూ సంబంధిత కార్పొరేటర్ ఇతర ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక బృందాలు. స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలతో కలిసి సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలను కూడా జిహెచ్‌ఎంసి అధికారులు స్వీకరించారు. 2017 జూన్ వరకు మొత్తం హైదరాబాద్ నగరాన్ని ప్రకటించేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేస్తోంది.