S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానసిక వికాసానికి క్రీడలు దోహదం

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తన వంతు కృషి చేస్తానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం మొగల్రాజపురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలోని మైదానంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్‌కు ఆటల పోటీలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సూచనలు, సలహాలు రాష్ట్ర, దేశ అభివృద్ధికి చాలా అవసరమని చెప్పారు. వారి సూచనలతోనే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇలాంటి పోటీల వల్ల వారిలో నూతన ఉత్తేజం లభిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సీనియర్ సిటిజన్స్ హోమ్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, ఇంకా వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేయాలని ఉన్నా రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితి సహకరించడం లేదని, అ యినా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడకుండా పాలన సాగిస్తున్నారని చెప్పారు. రూ.200 పింఛనును ఒక్కసారిగా రూ.వెయ్యి పెంచడం వల్ల వృ ద్ధులను చూసే పిల్లల వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ సమా ఖ్య గౌరవ సలహాదారు తొండెపు వెంక ట హనుమంతరావు, విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమశాఖ సంచాలకులు ఎడివి నారాయణరావు, కృష్ణాజిల్లా సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు బి.ముకుందరావు, జిల్లా కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావుతో పాటుగా అధిక సంఖ్యలో వృద్ధులు పాల్గొన్నారు. ఉత్సాహంగా పోటీలు జరిగాయి.