S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ట్రాఫిక్‌పై అవగాహన తెచ్చేందుకు కదం తొక్కిన యువత

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: నగరంలో ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన తీసుకురావడానికి ఆదివారం యువతీ యువకులు కదం తొక్కారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆదేశాలతో ట్రాఫిక్ డెప్యూటీ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పర్యవేక్షణలో నగరంలోని పలు కళాశాలల విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాలను చేపట్టారు. ట్రాఫిక్ భద్రతపై పూర్తి అవగాహన తీసుకురావడానికి ట్రాఫిక్ పోలీస్, ఆంధ్రా లయోలా కళాశాల, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశా ల విద్యార్థులతో కలిసి బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం నుండి ఆంధ్ర లయో లా కళాశాల వరకు 3కె రన్‌ను నిర్వహించారు. ముందుగా నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ రన్‌లో విద్యార్థులు నగర ప్రజలకు అవగాహన నిమిత్తం కార్డులతో ప్రదర్శన నిర్వహిస్తూ ట్రాఫిక్ భద్రత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర జాయింట్ పోలీస్ కమిషనర్ పి. హరికుమార్, ట్రాఫిక్ డిసిపి క్రాంతిరా ణా టాటా, డిసిపి అడ్మిన్ జివిజి అశోక్‌కుమార్, కళాశాలల ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.