S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దిద్దుబాటు!

శ్రీకాకుళం, ఆగస్టు 2: పిల్లలకు అక్షరాలు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు విద్యాయేతర విధులు నిర్వర్తించరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన హుకుం మేరకు జిల్లాలో ఐదుగురు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత కార్యదర్శులుగా ఉండరాదంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు వారిని మంగళవారం ఎమ్మెల్యేల పి.ఎ.లుగా విధులు నుంచి రిలీవ్ చేస్తూ వారివారి పాఠశాలల్లో పాఠాలు బోధించాలంటూ జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి ఉత్తర్వులు వారికి అందజేశారు.
ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న చిన్నికృష్ణ, శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్‌నాయుడు క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న మన్మధరావు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు జగదాంబ, అలాగే, విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజనావెంకటరంగరావు వద్ద పనిచేస్తున్న రాజాంకు చెందిన సూరపునాయుడులు నేటి నుంచి సంబంధిత ప్రజాప్రతినిధుల వద్ద పి.ఎ.ల బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న కలెక్టర్ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఇదిలా ఉండగా, వీరిలో కొంతమంది ఉపాధ్యాయులు టీచింగ్ విధుల నుంచి నాన్-టీచింగ్ విధులకు పూర్తిగా మార్చుకునే ప్రయత్నాలకు హుటాహటిన విజయవాడ పరుగులు తీశారు. ఇప్పటి వరకూ ప్రజాప్రతినిధుల వద్ద పి.ఎ.లుగా వ్యవహరించిన వారిలో కొంతమంది ఆ ఎమ్మెల్యేలు విధుల్లో చురుకైన పాత్ర పోషిస్తుండడంతో వారిని కాపుకాసేందుకు సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఉపాధ్యాయులంతా పాఠాలే చెప్పాలంటూ విద్యా హక్కు చట్టం మేరకు దేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనలు మరికొంతమందికి వర్తించవంటూ విద్యాశాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం. పిల్లలకు చదువులు చెప్పే మాస్టార్లు కొరత ఉంటుండగా, నాన్-టీచింగ్ విధులకు అనుమతులు ఇవ్వరాదంటూ న్యాయస్థానం చెప్పిన మాటలకు సర్వశిక్షఅభియాన్ మినహాయింపు ఉందంటూ విద్యాశాఖ అధికారులు వాదిస్తున్నారు. టీచింగ్ అనుసంధానం విభాగం కనుక అందులో ఉపాధ్యాయులు నాన్-టీచింగ్ విధులు నిర్వర్తించవచ్చునంటూ సమర్థిస్తున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి దేవానంద్‌రెడ్డి ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ న్యాయస్థానం సూచనలు ఏ మేరకు ఉన్నప్పటికీ, ప్రభుత్వపరంగా టీచింగ్ విధుల్లో పనిచేస్తున్న సుమారు 12 మంది వరకూ సర్వశిక్షఅభియాన్‌లో డెప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారని, వారిపట్ల ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు అందలేదంటూ సుస్పష్టం చేశారు.