S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక బౌద్ధారామంగా ‘శాలిహుండాం’

శ్రీకాకుళం, ఆగస్టు 2: శాలిహుండాంను ప్రత్యేక బౌద్ధ రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర శాసన సభ ప్రివిలేజెస్ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు అన్నారు. జిల్లా పర్యటనకు మంగళవారం విచ్చేసిన కమిటీ గార మండలంలో శాలిహుండం బౌద్ధారామాన్ని, మ్యూజియం, శ్రీకూర్మం, అరసవల్లి దేవస్థానాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శాలిహుండంను నిశితంగా పరిశీలించారు. శాలిహుండాం గొప్ప విజ్ఞాన నిధిగా అభివర్ణించారు. శాలిహుండంను సందర్శించడంతో జన్మధన్యమైందని అన్నారు. ఇటువంటి ప్రదేశాన్ని ప్రత్యేక బౌద్ధ రామంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడుతామన్నారు. గొప్ప రాజు అయిన గౌతమ బుద్ధుడు రాజరికం కాదు సమాజంలో పేదరికం పోవాలని, ప్రతి ఒక్కరూ సమానంగా జీవించాలని కోరుకున్నారని చెప్పారు. ఆ సంకల్పాన్ని ముఖ్యమంత్రి బాబు పునికిపుచ్చుకున్నారని అన్నారు. భారత దేశానికి బౌద్ధ వారసత్వం అవసరమన్నారు. మొత్తం 90దేశాల్లో బౌద్ధం విరాజిల్లుతోందని అన్నారు. శాంతి, సౌభాగ్యాలతో ఆకలి, దప్పిక కేకలు లేకుండా ఆ దేశాలు ఉన్నాయని చెప్పారు. అశోకుని రాజ్యంలో మంచి పరిపాలన చూశామని అన్నారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అన్ని మతస్తులు తమ మతంలోకి రమ్మని ఆహ్వానించారని, అయితే బౌద్ధంలోనే న్యాయం, ధర్మం, సమానత్వం ఉందని సంపూర్ణంగా గ్రహించి 1956 సంవత్సరంలో బౌద్ధాన్ని స్వీకరించారని చెప్పారు. బౌద్ధ ధర్మం కఠినమైనదని, దాన్ని ఆచరించడం కష్టమని అనేక మంది ఆచరించలేకపోయారని అన్నారు. బౌద్ధమే దేశానికి సరైన మార్గమని ఆయన పేర్కొంటూ బౌద్ధంలోని పంచశీల ఆధారంగా రాజ్యాంగ రచన జరిగిందని అన్నారు. వ్యక్తిగత విలువలకు, సమాజంలో దురాగతాలకు సంబంధించిన అనేక విషయాలను స్పృశించి సమాజహితానికి మార్గదర్శకంగా గౌతమ బుద్ధుడు నిలిచారని అన్నారు. ఇటువంటి సుగుణాల కలయుకతో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని బౌద్ధం విరాజిల్లిన ప్రాంతంలో రాష్ట్ర రాజధానిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి సంకల్పించారని చెప్పారు.
బౌద్ధ ఆస్తులు పరిరక్షించాలి
రాష్ట్రంలోగల బౌద్ధ ఆస్తులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతామని సూర్యారావు పేర్కొన్నారు. దేవాలయ, వారసత్వ పర్యాటకం కింద బాగా అభివృద్ధి పరిచేలా చర్యలు తీసుకుంటామని, బౌద్ధ ప్రదేశాలనుధునీకరించాలని అన్నారు.
బౌద్ధ రామాలు గల ప్రదేశంలో విద్యాసంస్థలు వంటివి వస్తే ఆ ప్రాంతం బాగా అభివృదిధ చెందుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాలీ భాషకు ఘన చరిత్ర ఉందన్నారు. పాలీ భాష సంపూర్ణంగా భారతీయ భాష అన్నారు. పాలీ భాషను కాపాడి, అందులో ఉన్న గ్రంథాలను క్రోడికరించడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయని, విజ్ఞాన గనిగా ఉంటుందని అన్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించేందుకు కృషి చేస్తామన్నారు. పాలీ భాష పరిజ్ఞానం లేకపోవడంతో అనేక విషయాలను పరిరక్షించలేకపోతున్నామని చెప్పారు. అంతకుముందు అరసవల్లి, శ్రీకూర్మం దేవాలయాలను సందర్శించుకున్నారు.
దేవాలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా వేదమంత్రాలతో స్వాగతం పలికారు. పూజాకార్యక్రమాలు నిర్వహించి, ఆశీర్వదించారు. దేవాలయాల విశిష్టతను విఫులంగా పేర్కొన్నారు. ఈ కమిటీతోపాటు ఆర్డీవో బి.దయానిధి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ వి.శ్యామలాదేవి, తహశీల్దార్లు ఎస్.సుధాసాగర్, సింహాచలం, గార మండలం పరిషత్ అధ్యక్షుడు భాస్కరరావు, శ్రీకూర్మాం సర్పంచ్ బరాటం రామశేషు, తదితరులు పాల్గొన్నారు.