S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశాలు

విజయనగరం(టౌన్), ఆగస్టు 1:ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులను అధికారులు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీ-కోసం గ్రీవెన్స్‌కు పలువురు తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చి వినతిపత్రాలు అందజేశారు. వ్యక్తిగత సామాజిక సమస్యలపై వినతులు అందాయి. హాస్టళ్ల మూసివేత కారణంగా సుమారు 40 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోల్పోయిన ఉద్యోగాలను భర్తీచేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 13 సాంఘిక సంక్షేమ వసతిగృహాలను ప్రభుత్వం మూసివేయడం వలన వాచ్‌మెన్‌లుగా, కమాటీలుగా వంటమనుషులుగా పనిచేస్తున్న వారిలో 40 మంది ఉద్యోగాలు కోల్పోయారని, తిరిగి వారికి బిసి సంక్షేమ వపతిగృహాలో అవకాశం కల్పించాలని ఎస్సీ, ఎస్టీ, బిసి వెల్ఫేర్ హాస్టల్స్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వై.అప్పారావు వినతిపత్రం అందజేశారు. జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ వైద్యకళాశాల సాధన కమిటీ జెఎసి కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. జిల్లాకు కేటాయించిన ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని అప్పలనాయుడు కోరారు. మూడుచక్రాల సైకిళ్లకోసం ముగ్గురు వికలాంగులు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో జితేంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పెద్దగెడ్డ నిర్వాసితుల పట్ట్భాములకు భూమి చూపండి

విజయనగరం(టౌన్), ఆగస్టు 1: పాచిపెంట మండలం పెద్దగెడ్డ నిర్వాసితులు ఎదుర్కొంటున్న భూసమస్యపై సోమవారం కలెక్టరేట్ వద్ద పాచిపెంట మండల సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈసందర్భంగా మండల పార్టీ కార్యదర్శి కోరాడ ఈశ్వరరావుమాట్లాడతూ ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల కిందట పెద్ద గెడ్డజలాశయం నిర్మాణంకొరకు కేసలి, మడవలస, తురాయిపాడు గ్రామాలకు చెందిన పలువురు గిరిజన రైతుల భూమలు తీసుకుందన్నారు. గిరిజనులు ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కోల్పోయిన భూములకు అధికారులు ప్రత్యామ్నాయంగా పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, ఈ కారణంగా 45 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిపై ఆధారపడిన గిరిజనులకు మంజూరు చేసిన పట్టాలు రెవెన్యూ అధికారులు ప్రత్యామ్నాయ స్థలాలను చూపలేదని, 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్.ఆర్.ప్యాకేజీ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు సంగమ్మ, పోరమ్మ, పైడితల్లి, ఎంపిటిసి వై. గంగమ్మ పాల్గొనిజిల్లా యంత్రాంగానికి వినతి పత్రం అందజేశారు.

‘పినవేమలి దళితుల సమస్యలు పరిష్కరించండి’
విజయనగరం(టౌన్), ఆగస్టు 1: విజయనగరం మండలం పినమేమలి గ్రామంలో నివసిస్తున్న ప్రభుత్వం మంజూరు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ మాట్లాడుతూ విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత దత్తత గ్రామం పినవేమలిలో సుమారు వందమంది దళితులు నివాసం ఉంటున్నా కనీస సౌకర్యాలకు నోచుకోలేదన్నారు. దళితుల కాలనీకి సిసి రోడ్డు మంజూరు చేయాలని, సామాజిక భవనం దళితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. హుదూద్ తుపాన్ కారణంగా దెబ్బతిన్న రచ్చబండ స్థానంలో కొత్త రచ్చబండ నిర్మించాలని కోరారు. దళితుల శ్మశానవాటికకు రహదారి సౌకర్యం కల్పించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోపెంట సాధూరావు, ఆదినారాయణ, దళితులు పాల్గొన్నారు.