S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉదయానే్న వీధుల్లో తిరగాలి...

కరీంనగర్, ఆగస్టు 1: పురపాలికల్లోని వీధుల్లో కమీషనర్లు, చైర్మన్లు వేకువజామునే్న పర్యటించి స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించాలని, అప్పుడే మున్సిపాలిటీలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్‌లో తొలిసారిగా రాష్ట్ర స్థాయి మేయర్లు, డిప్యూటి మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరందిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారని, 2018నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్రంలో 73 మున్సిపాలిటీలకుగాను 32 మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితి సర్ ప్లస్‌గా ఉన్నాయన్నారు. మున్సిపల్ పన్నులు వసూలు చేయాలని, గృహ వినియోగదారుల కనెక్షన్ పొంది కమర్షియల్‌గా వినియోగిస్తున్న వారిని గుర్తించి నీటి పన్నులు వసూలు చేయాలన్నారు. హరితహారం ద్వారా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, వచ్చే ఏడాది ప్రతి మున్సిపాలిటీలకు ఒక నర్సరీ ఏర్పాటు చేసుకుని మొక్కలను సిద్ధం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్, ప్లెక్సీ రహిత పట్టణాలుగా సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి బల్బులను వినియోగించాలన్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఉండేలా చర్యలు చేపట్టాలని, తొలుత మేయర్లు, చైర్మన్లు వారి ఇళ్లల్లో నిర్మించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 73మున్సిపాలిటీలలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు వాటిని పరిశీలించి మంచిగా పనిచేస్తున్న మున్సిపాలిటీలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రూ.1500కోట్లతో మున్సిపాలిటీల ఆర్థిక సహాయానికి రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు సూచన ప్రాయంగా మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజలకు అందించే వౌళిక వసతులు, సేవ కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతామని, సేవా దృక్ఫథంతో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మురికి కాలువ పారిశుద్ధ్యం పనులు చేపట్టి నాణ్యమైన తాగునీరు అందించి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలన్నారు. మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్, మున్సిపల్ పరిపాలన కమిషనర్ దానకిషోర్, రాష్ట్రంలోని మేయర్లు, డిప్యూటి మేయర్లు, చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం
* ఎంతటివారైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకోం
* కొత్తపల్లిలోని ఇసుక రీచ్‌ల్లో మంత్రి ఆకస్మిక తనిఖీ
* అధికారులు అప్రమత్తంగా ఉండాలంటు ఆదేశం

తిమ్మాపూర్, ఆగస్టు 1: అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. మైనింగ్ జాతీయ సంపద అని, అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఇసుక క్వారీలపై ఇటీవల వార్తల్లోకి వచ్చిన అక్రమ ఇసుక రవాణాపై గనుల శాఖ మంత్రి కెటిఆర్ సోమవారం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో మానేరు వాగులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్వారీలో పనిచేస్తున్న కూలీలతో మాట్లాడారు. కరీంనగర్ ఆర్‌డిఓ చంద్రశేఖర్‌తో క్వారీ విషయంలో మాట్లాడగా గత రెండు, మూడు రోజుల్లో జిల్లాలో చేసిన దాడుల్లో 40 లక్షల రూపాయల విలువగల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న క్వారీలపై మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్రమ ఇసుక క్వారీలపై అధికారులు వరుసగా దాడులు నిర్వహించాలని తెలిపారు. హైదరాబాద్ నుండి జిల్లాకు వస్తున్న సందర్భంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈయన వెంట ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్ రవీందర్ సింగ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, సునీల్ రావు, జడ్పీటిసిలు ఉల్లెంగుల పద్మ, శరత్ రావు, వేణు, ఎంపిపి బూడిద ప్రేమలత, వైస్ ఎంపిపి భూలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ఎడ్ల జోగిరెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఎటిఎం ద్వారా రైతులకు బ్యాంకు సేవలు సులభతరం
* రైతులందరికి ఎటిఎం కార్డులు అందించాలి
* సహకార సంఘాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి
* వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు
* రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, కెటిఆర్
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఆగస్టు 1: ఎటిఎం కార్డుల ద్వారా రైతులకు బ్యాంకు సేవలు సులభతరమవుతాయని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కరీంనగర్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎటిఎం సెంటర్‌ను మంత్రులు ఈటల రాజేందర్, కల్వకుంట్ల తారకరామారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం లోపు మరో 50 ఎటిఎంలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎటిఎం కార్డులు రైతులందరికి అందించాలని సూచించారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు రైతులకు ఉత్తమ సేవలు అందిస్తాయని తెలిపారు. అన్ని సహకార సంఘాలను ఆధునిక, సాంకేతిక విజ్ఞానంతో కంప్యూటరైజ్ చేసి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు (టెస్కాబ్) కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పది జిల్లాల్లోని 35 లక్షల మందికి మైక్రో ఎటిఎం కార్డులు జారీ చేస్తామన్నారు. త్వరలో అన్ని సహకార సంఘాలలో ఎటిఎంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎటిఎంలతో పాటు డబ్బులు జమ చేసే మిషన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సహకార ఎటిఎం కార్డుల ద్వారా అన్ని బ్యాంకుల ఎటిఎంలలో డబ్బులు తీసుకునేలా ఆన్‌లైన్ అనుసంధానం చేసినట్లు, త్వరలో మొబైల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కెడిసిసి బ్యాంక్ సిఇఓ సత్యనారాయణ రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్‌లు రవీందర్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.

మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలి
* సిఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్
* అనంతగిరి నిర్వాసితులతో అవగాహన సదస్సు
ఇల్లంతకుంట, ఆగస్టు 1: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మండలంలోని అంతగిరి శివారులో ఏర్పాటు చేస్తున్న రిజర్వాయర్‌లో నష్టపోతున్న భూ నిర్వాసితులకు మార్కెట్ రేటుకు నాలుగు రెట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని సిఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండలంలోని అనంతగిరిలో భూ నిర్వాసితులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రిజర్వాయర్‌ను గతంలో 1.7 టిఎంసి నీటి నిలువ గల రిజర్వాయర్ ప్రణాళిక ఉంటే దాన్ని 3.7 టిఎంసిల నీటి సామర్థ్యానికి పెంచడం వల్ల ఉపయోగమేంటని? ప్రశ్నించారు. కేవలం టిఆర్‌ఎస్ కార్యకర్తల కోసమే రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచారని విమర్శించారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రిజర్వాయర్ వల్ల ఇల్లంతకుంట మండలానికి ఒరిగేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. పిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ అనంతగిరిలో రిజర్వాయర్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ దాని డిజైన్‌ను మార్చడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అనంతగిరి రిజర్వాయర్ ప్రణాళిక నిర్మాణ వ్యయాన్ని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించి వారి సమస్యలను పరిష్కరించిన తర్వాతే రిజర్వాయర్ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సదస్సులో కాంగ్రెస్ నాయకులు పాశం రాజేందర్ రెడ్డి, బాల పోచయ్య, ఒగ్గు రమేష్, అంతగిరి వినయ్, మండల కాంగ్రెస్ నాయకులు కేశవరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అనంతగిరి గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మిడ్‌మానేరు, ఎల్‌ఎండిని నింపుతాం
* జిల్లాలో ఇంకా 2 కోట్ల మొక్కలు నాటుతాం
* సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
* రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఆగస్టు 1: ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసి జిల్లాలోని మిడ్‌మానేరు, ఎల్‌ఎండిలను నింపుతామని, ఇందుకోసం ఈ నెల 3న ఎస్సారెస్పీ వద్ద పూజలు నిర్వహించి నీటిని విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం మంత్రి రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2 కోట్లకు పైగా మొక్కలు నాటామని, మరో 2 కోట్ల మొక్కలు నాటనున్నట్లు వెళ్లడించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి అవసరమైన మందులు, వైద్యులను అందుబాటులో ఉంచుతామని మంత్రి రాజేందర్ స్పష్టం చేశారు.

బలవంతంగా భూములు తీసుకుంటే ఊరుకునేది లేదు
* పిసిసి ఉపాధ్యక్షుడు శ్రీ్ధర్‌బాబు
మహదేవపూర్, ఆగస్టు 1: కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటే ఊరుకునేది లేదని పిసిసి ఉపాధ్యక్షుడు శ్రీ్ధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రాజెక్ట్, పంప్ హౌస్‌ల నిర్మాణ స్థలాల్లో సోమవారం ఆయన ఆయా గ్రామస్థుల మాట్లాడిన సందర్భంగా భూ సేకరణ చట్టం ద్వారా అమలు చేయకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చిన్నట్లు రైతులను బెదిరించి భూములు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ కింద ఎంత భూమి అవసరమో తెలియకుండానే అసలు రిజర్వాయర్ సామర్థ్యం ఎంత, కాలువలకు సరిపడే భూ సేకరణ ఎంతా అదేమి తెలియకుండానే ప్రైవేట్ నిర్మాణ సంస్థలచే సర్వే చేయించడం సరైంది కాదని అన్నారు. కనీస అంఛనాల విలువలు తెలియకుండా టెండర్ల ప్రక్రియ వేస్తుందని ఆయన ఆరోపించారు. మెట్‌పల్లిలో 48 ఎకరాల భూమి కొల్పోతున్న రైతులు అందులో లావని పట్టాలు ఉన్న వారికి కూడా 2013 చట్టం ప్రకారం అమలు చేసి వారికి పూర్తి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2010లో అప్పటి యుపిఎ ప్రభుత్వం అంతర్ రాష్ట్రాల గోదావరి నది మీద 130 కోట్ల వ్యయంతో బ్రిడ్జీ నిర్మాణం పనులు చేపట్టిందని, కొత్తగా తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ అంతర్ రాష్ట్ర బ్రిడ్జీ ఇరు రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యం ఎంతగానో ఉపయోగపడడం చాలా సంతోషమని ఆయన అన్నారు. ఈ నది బ్రిడ్జీ యావత్ భారత దేశానికే పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం దర్శించుకునేందుకు నలు మూలల నుంచి వచ్చేందుకు వీలుంటుందని ఆయన అన్నారు.

మంచం పట్టిన జగిత్యాల..!
* ఇంటింటా జ్వర పీడితులు
* ప్రభుత్వ, ప్రైవేటు అసుపత్రుల కిటకిటా
జగిత్యాల, ఆగస్టు 1: వాతవరణ మార్పుల వల్ల జగిత్యాల పట్టణ ప్రజలు జ్వరాలతో సతమతం అవుతున్నారు. ప్రతి ఇంటా జ్వరంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీంతో జగిత్యాల ప్రాం తీయ వైద్యశాలతో పాటు ప్రైవేటు అసుపత్రులు కిటకిటాలాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో కలిషిత నీరు, దోమలు విజృంభించి స్వైర విహారం చేస్తున్నాయని, వాటి వల్ల జ్వర పీడితులు గణనీయంగా పెరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. వాతవరణ కలిగిన మార్పుల కారణంగా సాధారణ జ్వరంతో పాటు మలేరియా, టైఫాయిడ్, దగ్గు, దమ్ము, వాంతులు, విరేచాలు, కడుపునొప్పి తదితర సమస్యలతో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కురుస్తున్న వర్షం కారణంగా నీటి కలిషితం వల్ల జ్వరాలు విజృంభిస్తున్నాయి. కానీ మున్సిపల్ పాలకులు ఇంతవరకు క్లోరినేషన్, పరిసరాల అపరిశుభ్రతపై బ్లీచింగ్ చేయకపోవడంపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు వినియోగించే ఫాగింగ్ యంత్రం మూలన పడవేసి ప్రజారోగ్యాన్ని గాలికివదిలిపెట్టారని ప్రజలు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రీళ్లు దోమలతో సతమతం అవుతున్నామని, మలేరియా, టైపాయిడ్ జ్వరాలతో అసుప్రతుల్లో చేరడం వల్ల ఆర్థికంగా కృంగిపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైన మున్సిపల్ పాలకులు, అధికారులు స్పందించి వెంటనే పట్టణంలోని అన్ని వార్డులో ఫాగింగ్‌తో పాటు బ్లీచింగ్, క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
చర్యలు ప్రారంభిస్తాం:
సానిటరీ ఇన్స్‌పెక్టర్ వేణుమాధవ్
వార్డుల్లో చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్ సానిటర్ ఇన్స్‌పెక్టర్ వేణుమాధవ్‌ను వివరణ కోరగా పట్టణంలో హరితహారం కొనసాగుతున్న దృష్ట్యా కార్మికులు అక్కడే సేవలు అందిస్తున్నారని, 2,3 తేదీల్లో బ్లీచింగ్, క్లోరినేషన్, మురికి కాలువల్లో అయిల్‌బాల్ వేసే చర్యలు ప్రారంభిస్తామన్నారు. వర్షం వల్ల ఫాగింగ్ యంత్రాన్ని వార్డుల్లో తిప్పడం లేదని వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత అన్ని వార్డులో ఫాగింగ్ చేయిస్తామన్నారు.

20 అంశాలు.. ఏడు గంటలు
* సుదీర్ఘంగా భేటీ నిర్వహించిన మంత్రి కెటిఆర్
* ప్రజల ఆకాంక్షలకనుగుణంగా మారండి
* మేయర్, చైర్మన్లకు కెటిఆర్ హితవు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఆగస్టు 1: జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్‌లో తొలి సారిగా రాష్ట్ర స్థాయి మేయర్లు, డిప్యూటి మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అధికారులతో సోమవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిర్వహించిన సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. 20 అంశాలపై ఏడు గంటల పాటు మంత్రి కెటిఆర్ చర్చించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, పొడి, తడి చెత్త సేకరణ, హరితహారం, మిషన్ భగీరథ, తాగునీటి సరఫరా, ఎల్‌ఇడి బల్బుల వినియోగం, మహిళా సంఘాల కార్యక్రమాలు, డబుల్ బెడ్ రూం వంటి 20 అంశాలతోపాటు ఆర్థిక అంశాలు, ప్రజలకు అందించే వౌళిక సదుపాయాలపై కెటిఆర్ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే మేయర్లు, డిప్యూటి మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సూచనలను మంత్రి ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా కొందరు వ్యవహరించే తీరుతెన్నులు తనకు తెలుసని, ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలు, అవసరాలకనుగుణంగా మారాలని, మారకపోతే కష్టమని మంత్రి కెటిఆర్ సుతిమెత్తగా చురకంటించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆదర్శ మున్సిపాలిటీల పనితీరుపై మున్సిపల్ స్ట్ఫా కళాశాల ప్రతినిధి శ్రీనివాసాచారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఆసక్తిగా తిలకించారు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్, మున్సిపల్ పరిపాలన కమిషనర్ దానకిషోర్, రాష్ట్రంలోని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి కెటిఆర్ ప్రతిమలో మొక్కలు నాటారు. కాగా, హరితహారం కార్యక్రమానికి మున్సిపల్ ఉద్యోగులు ఒకరోజు వేతనం విరాళంగా 56,43,433 రూపాయల చెక్, మేయర్లు, చైర్‌పర్సన్ల ఒకరోజు వేతనం విరాళంగా రూ.12.60లక్షల చెక్కును మంత్రి కెటిఆర్‌కు అందజేశారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గంగాధర, ఆగస్టు 1: మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన పెద్ది అంజయ్య (45) అనే రైతు తన పంట చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తన వ్యవసాయం కోసం అప్పులు చేయగా, కరువు పరిస్థితుల్లో అప్పులు తీర్చలేక ఆదివారం సాయంత్రం పంట చేనుకు వెళ్తానని చెప్పిన అంజయ్య అక్కడే తన పొలంలో క్రిమిసంహారక మందు తాగి మృతి చెందగా, సోమవారం పొలం పనులకు వెళ్లిన గ్రామస్థులతో మృతి చెంది ఉండడం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా క్రిమిసంహారక మందు సేవించి మృతి చెందగా, పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ నీలం రవి ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని భార్య ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.

అప్పుల బాధతో చేనేత కార్మికుడి మృతి
కమలాపూర్, ఆగస్టు 1: కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కోమాకుల రాజశేఖర్ (40) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో సోమవారం మధ్యాహ్నం ఇంటి పైకప్పుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు, మృతుని భార్య శ్రీమతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజశేఖర్ అప్పుల బాధ భరించలేక మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

గోదారమ్మకు పుష్కర హారతి
ధర్మపురి, ఆగస్టు 1: ధర్మపురి క్షేత్రంలో గోదావరి అంత్య పుష్కరాలను పురస్కరింకుని, రెండవదినం సందర్భంగా సోమవారం రాత్రి గోదావరి హారతి కార్యక్రమాన్ని సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఆదివారంతో ప్రారంభించి, 12రోజుల పాటు అనునిత్యం రాత్రి కొనసాగే ఈకార్యక్రమంలో మునుముందుగా గోధూళి సుముహూర్తాన గోదావరినదికి ఊరేగింపుగా వెళ్ళారు. గోదావరి నదీ మాతకు ప్రత్యేక పూజలొనరించి, మంగళ హారతి, మంత్రపుష్ప నీరాజనాది క్రతువులు నిర్వహించిన అనంతరం సనాతన సాంప్రదాయ రీతిలో నదికి హారతిని ఇచ్చి, దీపాలను దొప్పలలో వెలిగించి వదిలి పెట్టారు. భక్తులు, యాత్రికులు, స్థానికులు కార్యక్రమంలో భాగస్వాములైనారు.