S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 05:03

హైదరాబాద్, ఆగస్టు 1: గోదావరి, కృష్ణా నదులపై ఉన్న జలాశయాలు మెల్లమెల్లగా నీటితో నిండుతున్నాయి. నీళ్లు పూర్తిగా అడుగంటిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి గత నెలరోజుల్లో దాదాపు 36 టిఎంసిల నీరు చేరడంతో నీటినిలు 40 టిఎంసిలకు చేరింది. ఈ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 42 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో కేవలం ఏడు టిఎంసిల నీరు మాత్రమే ఉంది.

08/02/2016 - 04:59

హైదరాబాద్, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు, నదులలోని ఇసుక తవ్వకాలకు పొక్లెయినర్లను వినియోగించడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దక్షిణాది జోన్ (చెన్నై) నిషేధం విధించింది. మాజీ ఎమ్మెల్యే దేవినేని రాజశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ పి జ్యోతిమణి, సభ్యుడు పి ఎస్ రావులతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

08/02/2016 - 04:54

విజయవాడ, ఆగస్టు 1: తిరుమలలో అన్నదానం కార్యక్రమానికి టిటిడి ఎంత ప్రాచుర్యం కల్పించిందో ప్రాణదానం పథకాన్ని అదేస్థాయిలో భక్తుల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాణదానం పథకానికి ప్రచారం కల్పిస్తే పెద్దఎత్తున దాతలు ముందుకొస్తారని అన్నారు. తద్వారా మరింత మంది పేదలకు వైద్యం అందించవచ్చని సూచించారు.

08/02/2016 - 04:52

న్యూఢిల్లీ, ఆగస్టు 1: విభజన హామీల అమలుకు ఎన్డీయే ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. సొమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, హోదా విషయంలో ఉన్న ఇబ్బందులను అధిగమించి ఏపీకి ఏం సహాయం చేయాలన్న దానిపై కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. ఏపీని ఆదుకోవాడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను కేంద్రం పరిశీలిస్తోందని అన్నారు. ఏపీని అన్ని విధాలుగా అందుకుంటుందని స్పష్టం చేశారు.

08/02/2016 - 04:51

విశాఖపట్నం, ఆగస్టు 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి వినూత్న రీతిలో నిరసన తెలపాలన్న టిడిపి అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు బాగానే స్పందించారు. ఆ పార్టీ ఎమ్మేల్యే ఏకంగా పీఠాధిపతిగా అవతారమెత్తారు. అంతటితో ఆగకుండా బిజెపి తరపున ఏపీ అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.

08/02/2016 - 04:49

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన తరుణంలో రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత రావడంతోనే హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మారుస్తున్నారని వైకాపా పార్లమెంట్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని ప్రధాన మంత్రి లీక్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

08/02/2016 - 04:47

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో కొనసాగుతూనే దశలవారీగా పోరాటాలు చేస్తామని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం అవసమయితే ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు రావడానికి సిద్ధమని వెల్లడించారు.

08/02/2016 - 04:47

హైదరాబాద్, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ( ఎపిపిఎస్‌సి) ద్వారా జరిపే ప్రత్యక్ష నియామకాలకు నిర్వహించే పరీక్ష విధివిధానాలను ప్రభుత్వం సోమవారం నాడు ఖరారు చేసింది. గ్రూప్ -1ఎ పరీక్ష 825 మార్కులకు , గ్రూప్ 1బి పరీక్ష 450 మార్కులకు, పంచాయతీ సెక్రటరీల ఎంపిక పరీక్ష 300 మార్కులకు నిర్వహించనున్నారు.

08/02/2016 - 04:46

మాస్కో, ఆగస్టు 1: అంతరిక్షంలో తిరుగాడుతున్న వ్యర్థాల కారణంగా పుడమికి ఎలాంటి ముప్పూ రాకుండా శాస్తవ్రేత్తలు ఓ వినూత్న ప్రయోగాన్ని చేశారు. భూమికి అతి సమీపంగా పరిభ్రమించే గ్రహ శకలాల కారణంగా ముప్పువాటిల్లే అవకాశం ఉండటంతో వాటిని తప్పించేందుకు ఈ ప్రయోగం ఉపకరిస్తుందని చెబుతున్నారు.

08/02/2016 - 04:46

హైదరాబాద్, ఆగస్టు 1: ఇంతకాలంగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ కార్యాలయం విజయవాడకు తరలివెళ్లనుంది. 4వ తేదీన ఎస్‌ఎస్‌ఎ కార్యాలయాన్ని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఆఫీసుకు సంబంధించిన ఫైళ్లు, ఫర్నీచర్ విజయవాడకు తరలివెళ్లాయి.

Pages