S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 03:23

ముషీరాబాద్, ఆగస్టు 1: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ ప్రభావం నగరంపై చూపింది. సోమవారం నగరాన్ని ముసురు కమ్మేసింది. తెల్లవారుజామునుంచే ముసురు..ఓ మోస్తరు చిరుజల్లుల కారణంగా వాతావరణం చల్లదనంగా మారింది. చెట్లు. పచ్చదనం అధికంగా ఉండే ఉస్మానియా యూనివర్శిటీ, జామై ఉస్మానియా, ఇందిరాపార్కు తదితర ప్రాంతాలలో ఉష్ణోగ్రత మరింత పడిపోయి చల్లదనం పెరిగింది.

08/02/2016 - 03:22

హైదరాబాద్, ఆగస్టు 1: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్‌ఐ అధికారులు అక్రమంగా తరలిస్తున్న కొకైన్‌ను పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 10 ప్యాకెట్ల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తున్న జోసెఫ్ జార్జ్ అనే ప్రయాణికుడు రూ. 2 కోట్లు విలువ చేసే కొకైన్‌ను అక్రమంగా తరలిస్తున్నాడు.

08/02/2016 - 03:21

హైదరాబాద్, ఆగస్టు 1: రాజస్థాన్‌లో 2016 నవంబర్ 9 నుండి 11 వరకు ‘అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు’ (గ్లోబల్ రాజస్థాన్ అగ్రిటెక్ మీట్-2016..గ్రామ్) నిర్వహిస్తున్నట్టు రాజస్థాన్ సేద్యం మంత్రి ప్రభులాల్ సయానీ ప్రకటించారు. తెలంగాణ, ఎపి రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులతో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో సోమవారం ఆయన సమావేశమయ్యారు.

08/02/2016 - 03:19

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ ఎమ్సెట్-2 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పేపర్ లీక్ కావడం వల్ల ప్రయోజనం పొందిన విద్యార్ధుల జాబితాలను పోలీసులు సిద్ధం చేస్తుండగా మరో పక్క ప్రతిరోజూ వందలాది ఫిర్యాదులు సిఐడికి అందుతున్నాయి. ఒకే పరీక్ష జరిగి ఉంటే అభ్యర్ధుల ప్రతిభా పాటవాలను అంచనా వేయడం, విశే్లషణ చేయడం పోలీసులకు కష్టమయ్యేది.

08/02/2016 - 03:17

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు మల్లన్న సాగర్ వివాదం, మరోవైపు ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంతో సతమతమవుతుండగా, ఏపి సర్కారు ప్రత్యేక హోదా విషయంలో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తున్నది.

08/02/2016 - 03:17

న్యూఢిల్లీ, ఆగస్టు 1: నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని పట్టుదలగా ఉన్న బిజెపి రానున్న మూడు రోజుల్లో పార్టీ ఎంపీలందరూ తప్పని సరిగా సభకు హాజరుకావాలంటూ సోమవారం విప్ జారీ చేసింది.

08/02/2016 - 03:16

చింతూరు, ఆగస్టు 1: చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేరు, బీజాపూర్ జిల్లాల్లో పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో సోమవారం ఒక మహిళ సహా అయిదుగురిని మావోయిస్టులు హతమార్చారు. కాంకేరు జిల్లాలో నలుగురిని, బీజాపూర్ జిల్లాలో ఒకరిని మట్టుబెట్టారు. కాంకేరు జిల్లా కొయిలీబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొందుల్‌మెడమట గ్రామానికి చెందిన కడియం రాజు, మరకం సోమ, మరో మహిళను ఆదివారం రాత్రి కిడ్నాప్ చేశారు.

08/02/2016 - 02:47

చిత్రం.. అతిచిన్న వయసులోనే పర్వతారోహణ చేసిన బాలిక ఆర్యన్ బాలాజి సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న దృశ్యం

08/02/2016 - 02:45

చిత్రం.. పార్లమెంటు ఆవరణలోకి యుద్ధం ట్యాంకులు వచ్చాయేమిటని ఆశ్చర్యపోతున్నారా! రానున్న 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఆర్‌డివో సంస్థ యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్ తదితర క్షిపణులను ఇక్కడ ప్రదర్శిస్తోంది.

08/02/2016 - 02:43

న్యూఢిల్లీ, ఆగస్టు 1: జమాత్ ఉద్ దావా (జెయుడి), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు బహిరంగ హెచ్చరికలు చేసినప్పటికీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పాకిస్తాన్‌కు వెళ్తున్నారు. సార్క్ దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వెళ్తున్న రాజ్‌నాథ్ సింగ్ ఆ దేశ హోంమంత్రితో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరుపబోరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Pages