S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 04:15

హైదరాబాద్, ఆగస్టు 1: హరితహారం నిర్వహణను కొందరు ఉదాశీనంగా తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు బాగానే పని చేస్తున్నా, కొందరి నిర్లక్ష్యం వల్ల కార్యక్రమంలో వెలితి కనిపిస్తోందన్నారు. జిల్లాల్లో ఏ ఎమ్మెల్యే కార్యక్రమంలో బాగా పాల్గొన్నారో, ఎవరు పాల్గొనలేదో మంత్రులకు ఫోన్ ద్వారా సిఎం వివరాలు అందించారు.

08/02/2016 - 04:13

కరీంనగర్, ఆగస్టు 1: పురపాలికల్లో ప్రధానంగా 20 అంశాలను తీసుకుని ముందుకెళ్లేందుకు నిర్ణయించామని, వచ్చే జూన్ 2నాటికి కనీసం అందులో మూడోవంతైనా సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు రాష్ట్ర ఐటి, పురపాలక మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. సోమవారం కరీంనగర్‌లో తొలిసారి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అధికారులతో రాష్టస్థ్రాయి సమావేశం నిర్వహించారు.

08/02/2016 - 04:07

మహబూబ్‌నగర్, ఆగస్టు 1: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాపాలు పెరిగిపోయాయని, ఆయన పాపాలను వదిలిపెట్టేది లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ హెచ్చరించారు. తెలంగాణ కేవలం కెసిఆర్ కుటుంబానికి మాత్రమే వచ్చినట్టుగా అనిపిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. కెసిఆర్ చేస్తున్న పాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటిని ఎండగడుతామని ద్వజమెత్తారు.

08/02/2016 - 03:59

హైదరాబాద్, ఆగస్టు 1: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉపరితలద్రోణితో కలవడంతో పాటు, వచ్చే రెండురోజుల్లో అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన అల్పపీడనంగా మారుతుండంతో కోస్తా, తెలంగాణల్లో వచ్చే రెండు, మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భలలో భారీనుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

08/02/2016 - 03:58

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రకు ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పరిశీలిస్తోంది. ఏపీకి హోదా ఇవ్వటం సాధ్యంకాదు కనుక, దానిస్థానే ప్యాకేజీ ప్రకటించటం ద్వారా అత్యధిక ఆర్థిక సాయం అందించాలని కేంద్రం కసరత్తు చేస్తోంది.

08/02/2016 - 03:55

న్యూఢిల్లీ, ఆగస్టు 1:దేశ వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి ఒకే పరీక్షా విధానం నీట్ అమలులోకి వస్తుంది.

08/02/2016 - 03:55

హైదరాబాద్, ఆగస్టు 1: ఆర్థిక రంగంలో నిష్ణాతులు, ఉభయ తెలుగు రాష్ట్రాల హైదరాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్‌ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నియమించింది. ఈ మేరకు న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి రాజేందర్ కశ్యప్ ప్రత్యేక గెజిట్ ప్రకటన విడుదల చేశారు.

08/02/2016 - 03:53

న్యూఢిల్లీ,జూలై 1:ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఆయిదేళ్లలో రూ.22,112 కోట్లు నిధుల లభ్ధి చేకూరనుందని కేంద్రమంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటి వరకు కేంద్రం చేసిన సహాయంపై రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అడిగిన ప్రశ్నలకు ఇందర్‌జిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మార్చి 31 నాటికి మొత్తం రూ.6,403 కోట్ల విడదల చేసినట్లు పేర్కొన్నారు.

08/02/2016 - 03:51

విజయవాడ, ఆగస్టు 1: ఆసియాలోనే అత్యంత అధునాతన వైద్య పరికరాల తయారీ, పరీక్షా కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (ఎఎంటిజెడ్) పేరుతో ఏర్పాటవుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

,
08/02/2016 - 03:47

నూజివీడు, ఆగస్టు 1: కృష్ణానది వైపుకి గోదావరి జలాలు గలగలాపారిస్తున్న పోలవరం కుడికాల్వకు సోమవారం తెల్లవారుఝామున గండిపడింది. కృష్ణాజిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ సమీపంలోని 122.100 కిలోమీటరు వద్ద రామిలేరు అండర్ టనె్నల్ పక్కనే గండి పడటంతో నీరంతా వృథాగా కొల్లేరులోకి పోతోంది.

Pages