S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 03:44

హైదరాబాద్, ఆగస్టు 1: మెడికల్ ఎమ్సెట్-2 పరీక్ష మరోమారు తిరిగి నిర్వహించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. శనివారం నుంచి మూడు రోజులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, వివిధ విభాగాల అధిపతులతో తర్జనబర్జన కొనసాగుతోంది. మెడికల్ ఎమ్సెట్ నిర్వహిస్తామని ప్రకటించింది మొదలు ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి.

08/02/2016 - 03:42

న్యూఢిల్లీ, జూలై 1: బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో ఆంధ్రను కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యవేక్షణ కమిటీలో ఏపీని తొలిగించాలన్న మహారాష్ట్ర, తెలంగాణ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. బాబ్లీ పర్యవేక్షణ కమిటీపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకుర్, జస్టిస్ ఖన్‌వాల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

,
08/02/2016 - 03:34

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు సోమవారం లోక్‌సభలో ధర్నా చేశారు. టిడిపికి చెందిన పనె్నండు మంది సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా కోసం నినదిస్తూ గందరగోళం సృష్టించారు. తమ రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ వారిచ్చిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది.

08/02/2016 - 03:30

హైదరాబాద్, ఆగస్టు 1: ఎమ్సెట్-2 పేపర్ లీక్ కుంభకోణంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ఎబివిపి రాష్టక్రార్యదర్శి అయ్యప్ప డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఆయన రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎమ్సెట్ లీక్ కాదని, ఇది టిఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దల హయాంలో జరిగిన అతి పెద్ద స్కాం అని ఆరోపించారు.

08/02/2016 - 03:27

హైదరాబాద్, ఆగస్టు1: ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నందున ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భవించి, టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి మంచినీటిని ఇవ్వలేకపోతే ఓట్లు అడగమని ప్రకటించి ముఖ్యమంత్రి సంచలనం సృష్టించారు.

08/02/2016 - 03:27

శేరిలింగంపల్లి, ఆగస్టు 1: ముంబయ జాతీయ రహదారిపై మదీనగూడ వద్ద ఓ లోడ్ లారీ బీభత్సం సృష్టించింది. గుడిసెపైకి దూసుకెళ్లడంతో గాఢనిద్రలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది సేపటికే తండ్రి మరణించగా కొడుకు ప్రాణాపాయం నుంచి బతికి బయటపడ్డాడు.

08/02/2016 - 03:26

చార్మినార్, ఆగస్టు 1: పాతబస్తీలోని బోనాలు ప్రశాంతంగా ముగిసాయి. రెండవ రోజైన రంగం కార్యక్రమంలో రాష్ట్రాంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఏపి, మహారాష్ట్ర నుంచి భక్తులు విచ్చేశారు. మొదటిసారిగా మిరాలంమండి మహంకాలేశ్వరి ఆలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు స్వర్ణలత భవిష్యవాణి తెలిపింది.

08/02/2016 - 03:25

హైదరాబాద్, ఆగస్టు 1: బిజెపికి విడాకులు ఇవ్వాలంటూ గళమెత్తుతున్న తెదేపా నేతల తీరుపై ఆ పార్టీలో చర్చ మొదలయింది. తాము కూడా అదే కోరుకుంటున్నామని, అది ఎంత త్వరగా జరిగితే పార్టీకి అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెదేపాతో విడిపోవాలని మెజారిటీ నేతలు కోరుకుంటుండగా, మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మాత్రం కలసి ఉండాలని కోరుకోవడం పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది.

08/02/2016 - 03:24

ఖైరతాబాద్, ఆగస్టు 1: ప్రభుత్వ వైఫల్యంతోనే ఎంసెట్-2 లీకేజీ అయిందని తెలంగాణ ఉద్యమ వేదిక విమర్శించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేదిక నాయకులు చెరుకు సుధాకర్, యన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐచే విచారణ జరిపించి దోశులను శిక్షించాని డిమాండ్ చేశారు.

08/02/2016 - 03:23

హైదరాబాద్, ఆగస్టు 1: గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీర్చే ప్రధాన జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమయత్‌సాగర్ (బుద్వేల్ చెరువు) కొనే్నళ్లుగా నీటి మట్టాలు అడుగు అంటి పోయాయి. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్ గండిపేట్ ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకుంది. ఎట్టకేలకు గండిపేట జలాశయానికి జలకళవచ్చింది.

Pages