S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘హోదా’కోసం దశలవారీ పోరాటం

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో కొనసాగుతూనే దశలవారీగా పోరాటాలు చేస్తామని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం అవసమయితే ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు రావడానికి సిద్ధమని వెల్లడించారు. సోమవారం టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, రామ్మోహన్ నాయుడు, గల్లా జయ్‌దేవ్, సిఎం రమేశ్, అవంతి శ్రీనివాస్, ఎన్.శివప్రసాద్, మురళిమోహన్ పార్లమెంట్ వెలుపల విజయచౌక్ వద్ద విలేఖరులతో మాట్లాడారు. ప్రత్యేకహోదా సాధనకు శక్తివంచన లేకుండా కృషిచేస్తామని, కేంద్రం నుంచి బయటకు రావడం రెండు నిమిషాలు పడుతుందని తోట నర్సింహ అన్నారు. గత శుక్రవారం రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మనస్తాపం చెందారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా బీజేపీ మాట నిలబెట్టు కోవాలని కోరారు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులు, అదనపు రాయితీలు, ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ దేశంలోని అన్ని పార్టీలు స్పష్టం చేసినా ఆర్థిక మంత్రి నోరు మెదపటం లేదని చెప్పుకొచ్చారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రెండున్నర ఏళ్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాన్ని గౌరవించి ముందుకెళ్లామని, కాని కేంద్రం తీరు సరిగ్గా లేదని అన్నారు. శివప్రసాద్ మాట్లాడుతూ ‘చంద్రబాబు అలుగటమే ఎరగని అజాత శత్రువని, అయన అలిగితే ఎవరికీ మంచిది కాదని’ అన్నారు. త్వరలో ప్రధాని మోదీని కలుస్తామని, ఆయన స్పందననుబట్టి తదుపరి చర్యలు ఉంటాయని మురళీ మోహన్ అన్నారు. అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ హోదా కోసం దశాలవారీగా నిరసనలు తెలియజేస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకన్నా పదవులు ముఖ్యంకాదన్నారు.