S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పొక్లెయినర్ల వినియోగంపై నిషేధం

హైదరాబాద్, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు, నదులలోని ఇసుక తవ్వకాలకు పొక్లెయినర్లను వినియోగించడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దక్షిణాది జోన్ (చెన్నై) నిషేధం విధించింది. మాజీ ఎమ్మెల్యే దేవినేని రాజశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ పి జ్యోతిమణి, సభ్యుడు పి ఎస్ రావులతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక రీచ్‌లలోకి ట్రాక్టర్లు టిల్లర్లు తప్ప మిగిలిన ఇతర వాహనాలను అనుమతించవద్దని కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇసుక విధానాన్ని సైతం ట్రిబ్యునల్ ముందు మాజీ ఎమ్మెల్యే సవాలు చేశారు.