S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 02:22

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రింట్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ల కోసం చేసిన ఖర్చు 35 కోట్ల రూపాయాలు. ఆర్టీఐ చట్టం కింద అనిల్ గల్గానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను కేంద్రం అందజేసింది.

08/02/2016 - 02:17

కింగ్‌స్టన్ (జమైకా), ఆగస్టు 1: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో విజృంభించిన టీమిండియా ఓపెనర్ లోకేష్ రాహుల్ కెరీర్‌లోనే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో సత్తా చాటుకున్నాడు.

08/02/2016 - 02:17

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ అభియోగాల నుంచి రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు విముక్తి కల్పించి దేశం తరఫున అతను రియో ఒలింపిక్స్ బరిలోకి దిగేందుకు వీలుకల్పించాలని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని సహచర రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్టు సుశీల్ కుమార్ స్వాగతించాడు.

08/02/2016 - 02:16

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ వ్యవహారంలో నాడా విచారణ కమిటీ సోమవారం నర్సింగ్ యాదవ్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైందని డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పేర్కొన్నాడు.

08/02/2016 - 02:14

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ కుంభకోణంలో రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు ఊరట లభించింది. గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్న ఈ వివాదానికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం ఎట్టకేలకు తెరదించి నర్సింగ్ యాదవ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో అతను ఈ నెల 5వ తేదీ నుంచి బ్రెజిల్‌లో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.

08/02/2016 - 02:13

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ వ్యవహారంలో సోమవారం నాడా విచారణ కమిటీ ఇచ్చిన తీర్పు పట్ల రెజ్లర్ నర్సింగ్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశాడు. ఇక రియో ఒలింపిక్స్‌కు వెళ్లి దేశానికి పతకాన్ని తీసుకురావాలని ఎదురు చూస్తున్నానని అతను స్పష్టం చేశాడు. ‘నేను ఎటువంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. అందుకే న్యాయం జరుగుతుందని గట్టిగా విశ్వసించా. ఇప్పుడు నాడా విచారణ కమిటీ ఇచ్చిన తీర్పుతో నాకు న్యాయం జరిగింది.

08/02/2016 - 02:10

ముంబయి, ఆగస్టు 1: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని స్పష్టం చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు బిసిసిఐ పెద్దలు మంగళవారం ముంబయిలో సమావేశం కానున్నారు.

08/02/2016 - 02:06

మార్లో (ఇంగ్లాండ్), ఆగస్టు 1: ఇంగ్లాండ్ చేతిలో భారత జూనియర్ హాకీ జట్టుకు పరాజయం ఎదురైంది. మార్లోలోని బిషామ్ అబే స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 2-1 గోల్స్ తేడాతో భారత జూనియర్ జట్టుపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు బాగానే ఆడినప్పటికీ పలు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది.

08/02/2016 - 02:05

ముంబయి, ఆగస్టు 1: స్పెయిన్‌లోని సెగోవియాలో జరిగిన ఎటిపి చాలెంజర్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు పురవ్ రాజా, దివిజ్ శరణ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో మూడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు ఆదివారం రాత్రి జరిగిన డబుల్స్ ఫైనల్ పోరులో జోవాక్విన్ మునోజ్ హెర్నాండెజ్ (స్పెయిన్), అకీరా సాంటిల్లన్ (జపాన్) జోడీపై విజయం సాధించారు.

08/02/2016 - 01:20

న్యూఢిల్లీ, ఆగస్టు 1: వౌలిక రంగాభివృద్ధి జూన్‌లో 5.2 శాతంగా నమోదైంది. బొగ్గు, సిమెంట్ రంగాల్లో రెండంకెల వృద్ధి ఇందుకు దోహదం చేసింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలతో కూడిన ఈ వౌలిక రంగం వృద్ధిరేటు నిరుడు జూన్‌లో 3.1 శాతంగానే ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 38 శాతం వాటా ఈ ఎనిమిది కీలక రంగాలదే.

Pages