S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలుగు రాష్ట్రాలకు తలనొప్పులు

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు మల్లన్న సాగర్ వివాదం, మరోవైపు ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంతో సతమతమవుతుండగా, ఏపి సర్కారు ప్రత్యేక హోదా విషయంలో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు మంగళవారం (2న) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అధికార విపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రాంతానికి విపక్ష నేతలు వెళ్ళకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తున్నది. దీంతో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి కోర్టును ఆశ్రయించి ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతించాల్సిందిగా కోరారు. అందుకు న్యాయమూర్తి పరిమిత అనుచరులతో వెళ్లేందుకు అనుమతించారు. ఈ మేరకు దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి కోర్టు ఆదేశం ప్రకారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఇది కాకుండా ప్రభుత్వాన్ని ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహరంతో విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇరకాటంలో పడేసాయి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ఏపి ప్రభుత్వం ప్రత్యేకహోదా అంశంతో బాగా ఇబ్బంది పడుతోంది. విపక్షాల విమర్శలే కాకుండా ప్రజల్లోనూ ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఆందోళన టిడిపి నేత చంద్రబాబు నాయుడులో కనిపిస్తున్నది. హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చేతులెత్తేయడంతో బిజెపితో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని, కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని టిడిపిపై ఒత్తిడి పెరుగుతున్నది. ఇలాఉండగా వైఎస్సార్ నాయకుడు, బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటం కాబట్టి రాజకీయ పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రజలు కూడా బంద్‌కు సహకరించాలని ఆయన కోరారు.