S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లబ్ధి పొందింది ఎవరు?

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ ఎమ్సెట్-2 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పేపర్ లీక్ కావడం వల్ల ప్రయోజనం పొందిన విద్యార్ధుల జాబితాలను పోలీసులు సిద్ధం చేస్తుండగా మరో పక్క ప్రతిరోజూ వందలాది ఫిర్యాదులు సిఐడికి అందుతున్నాయి. ఒకే పరీక్ష జరిగి ఉంటే అభ్యర్ధుల ప్రతిభా పాటవాలను అంచనా వేయడం, విశే్లషణ చేయడం పోలీసులకు కష్టమయ్యేది. కాని కొంత మంది విద్యార్ధులు ఇటు ఆంధ్రా, అటు తెలంగాణ ఎమ్సెట్‌లతో పాటు నీట్ పరీక్షకు హాజరుకావడం, తెలంగాణలో జరిగిన రెండో ఎమ్సెట్ రాయడంతో ఒక విద్యార్ధికి వివిధ ప్రవేశ పరీక్షల్లో జరిగిన ర్యాంకుల వ్యాత్యాసాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆ అభ్యర్ధుల ప్రతిభ అనుమానాస్పదంగా మారింది.కొంత మంది అనుమానిత అభ్యర్ధులపై పోలీసులు నిఘా ఉంచి, వారి సెల్‌ఫోన్ల కాల్ డాటాను, వారి ప్రతిభాపాటవాలను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా పిఎస్‌డి రాహుల్ (హాల్‌టిక్కెట్ 8309742) అనే అభ్యర్ధికి ఎమ్సెట్-2లో 152వ ర్యాంకు వచ్చింది.
అదే విద్యార్ధికి తొలుత నిర్వహించిన ఎమ్సెట్-1( హాల్‌టిక్కెట్ 4301767) లో 1318 ర్యాంకు రావడంపై కూడా చర్చ జరుగుతోంది. ఆంధ్రాలో జరిగిన ఎమ్సెట్‌లో (974511079) 38,574వ ర్యాంకు వచ్చింది. అలాగే మేరగాని లావణ్య (హాల్‌టిక్కెట్ 8308323)కు 343 ర్యాంకు వచ్చింది. ఆమె తొలుత రాసిన ఎమ్సెట్‌లో 16,532 ర్యాంకు వచ్చింది. ఆంధ్రాలో ఆమెకు 20773 ర్యాంకు వచ్చింది. అలాగే వంగర జాహ్నవికి ఎమ్సెట్ 2లో 704 ర్యాంకు రాగా, ఎమ్సెట్ -1లో 17131, ఆంధ్రా ఎమ్సెట్‌లో 24661 ర్యాంకు వచ్చాయి. కల్లూరి బాబాకు ఎమ్సెట్-2లో 1508 ర్యాంకు రాగా, ఎమ్సెట్-1లో 17,875 ర్యాంకు, ఎపి ఎమ్సెట్‌లో 17363 ర్యాంకు వచ్చాయి. ముప్పిడోజు భవానికి ఎమ్సెట్-2లో 952 ర్యాంకు రాగా, ఎమ్సెట్-1లో 19414, ఎపి ఎమ్సెట్‌లో 26941 ర్యాంకు వచ్చాయి. గుర్రం దీపక్‌కు ఎమ్సెట్-2లో 1990, ఎమ్సెట్-1లో 23155, ఎపి ఎమ్సెట్‌లో 22702, పిడుగు సునీతారెడ్డికి ఎమ్సెట్-2లో 1503 ర్యాంకు రాగా, ఎమ్సెట్-1లో 28170, ఎపి ఎమ్సెట్‌లో 55011 వచ్చాయి. ఎంవి సాయి నవీన్‌బాబుకు ఎమ్సెట్-2లో 1292 ర్యాంకు రాగా, ఎమ్సెట్-1లో 32808 ర్యాంకు, ఎపి ఎమ్సెట్‌లో 46197 ర్యాంకు సాధించారు. మేదరమెట్ల వరుణసాయికి ఎమ్సెట్-2లో 1877 ర్యాంకు రాగా, ఎమ్సెట్-1లో 38232 , ఎపి ఎమ్సెట్‌లో 29965 ర్యాంకు వచ్చాయి.
కూన అవినాష్ కుమార్‌కు ఎమ్సెట్-2లో 569 ర్యాంకు రాగా, ఎమ్సెట్-1లో 1078 ఎపి ఎమ్సెట్‌లో 17574 ర్యాంకు దక్కింది. ఆర్వీ నేషా శివానీ ఎమ్సెట్-2లో 23వ ర్యాంకు, ఎమ్సెట్-1లో 596, ఎపి ఎమ్సెట్‌లో 13698 ర్యాంకు దక్కాయి. అభినందిత తామాడకు ఎమ్సెట్-2లో 1795 ర్యాంకు రాగా, ఎమ్సెట్-1లో 8411, ఎపి ఎమ్సెట్‌లో 12330 ర్యాంకు వచ్చాయి. అనుపురమ్ కీర్తిప్రియకు ఎమ్సెట్-2లో 1869, ఎమ్సెట్-1లో 10485 , ఎపి ఎమ్సెట్‌లో 18606 ర్యాంకు దక్కాయి. ఎన్ ఎన్ అనన్యకు తెలంగాణ ఎమ్సెట్ -2లో 727 ర్యాంకు రాగా, ఎమ్సెట్-1లో 27,939 ర్యాంకు, ఎపి ఎమ్సెట్‌లో 38099 ర్యాంకు దక్కాయి. సుందరి ప్రవల్లికకు ఎమ్సెట్-2లో 727 ర్యాంకు రాగా, ఎమ్సెట్-1లో 27939 , ఎపి ఎమ్సెట్‌లో 38099 ర్యాంకు వచ్చాయి. వీరంతా పలుకార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. వీరు అక్రమాలకు పాల్పడటం వల్ల మంచి ర్యాంకులు సాధించారా లేక ప్రతిభతోనే సాధించారా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.