S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 23:17

నల్లగొండ రూరల్, ఆగస్టు 1: మానవుడు తల్చుకుంటే ఏమైనా సాధించవచ్చని, చిన్న పరికరంతో పంటల సాగులో ముందుకు సాగవచ్చని నల్లగొండ మండలం అప్పాజిపేటకు చెందిన యువరైతు మేక నర్సిరెడ్డి నిరూపించారు.

08/01/2016 - 23:16

నల్లగొండ టౌన్, ఆగస్టు 1: నల్లగొండ పట్టణం అలకాపురికాలని వాసి కానిస్టేబుల్ బజ్జూరి రమేష్(34) సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో మృతి చెందినట్లుగా రైల్వే ఎస్‌ఐ జానకిరాములు తెలిపారు. రైలు పట్టాల సమీపంలోని తన ఇంటి నుండి రమేష్ బహిర్భూమి కోసం పట్టాల దాటుతున్న క్రమంలో రైలు ఢీ కొని మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.

08/01/2016 - 23:16

నాగార్జునసాగర్, ఆగస్టు 1: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. గత మూడురోజుల నుండి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం నుండి సాగర్‌కు నీటివిడుదల చేసి సాగర్ నుండి కుడికాల్వ ద్వారా నీటివిడుదల చేయాలని కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయించడంతో గత మూడురోజులుగా కుడికాల్వ ద్వారా ఆంధ్రా రాష్ట్రానికి నీటివిడుదల చేస్తున్నారు.

08/01/2016 - 23:15

దామరచర్ల, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి వచ్చిన కృష్ణా పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు తెలిపారు. సోమవారం మండలంలోని వాడపల్లి వద్దగల పుష్కరఘాట్లను పరిశీలించారు. మంత్రులకు దేవాదాయశాఖ వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

08/01/2016 - 23:15

నల్లగొండ టౌన్, ఆగస్టు 1: నల్లగొండ పట్టణం మున్సిపాల్టీ అభివృద్ధి పనుల కోసం ఐపిడిఎస్ స్కీమ్ కింద విద్యుత్ పనుల కోసం పదిన్నర కోట్లు మంజూరైనట్లుగా మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిపి పాశంరాంరెడ్డిలు తెలిపారు.

08/01/2016 - 23:14

చిట్యాల, ఆగస్టు 1: తెలంగాణరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం అవీనీతిలో కూరుకుపోయిందని భాజపా కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన భాజపా మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి గోలి మధుసూధన్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరైనారు.

08/01/2016 - 23:13

నల్లగొండ, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు ఈ నెల 12నుండి 23వరకు తొలిసారిగా ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం నిర్ధేశిత గడువు ఈ నెల 5వ తేదిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డిలు అధికారులను ఆదేశించారు.

08/01/2016 - 22:17

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

08/01/2016 - 22:11

కథ, మాటలు, పాటలు:
సదాశివ బ్రహ్మం
నృత్యం: వెంపటి చినసత్యం
కూర్పు: గోవింద స్వామి
కళ: కెఆర్ శర్మ
కెమెరా: రాము
సంగీతం: జి అశ్వత్థామ
నిర్మాత: పి సోమసుందరం
సహకార దర్శకుడు: లంక సత్యం
దర్శకత్వం: పి.పుల్లయ్య

08/01/2016 - 22:09

తమిళ భాషలో క, ఖ, గ, ఘలకు ఒకటే అక్షరం. చెన్నయ్ మైలాపూర్‌లో ఉన్న కపాలీశ్వరన్ కోయల్‌ను కపాళి, కబాలి, గబాలి, గపాలి.. ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. అది వాళ్ల తమిళ అక్షర సంప్రదాయం హక్కు. తెలుగులో డబ్ చేశాక మనకు అన్ని అక్షరాలు ఉన్నాయి కనుక కపాలి అనాలి. (కపాలి అంటే పుర్రె అని అర్థం. శివుడు స్మశానంలో పుర్రెలు వాడాడు కనుక) అలా కపాలి అని పెడితే బాగుండేది. కబాలి అనడం కరెక్టు కాదు.

Pages