S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

నాగార్జునసాగర్, ఆగస్టు 1: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. గత మూడురోజుల నుండి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం నుండి సాగర్‌కు నీటివిడుదల చేసి సాగర్ నుండి కుడికాల్వ ద్వారా నీటివిడుదల చేయాలని కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయించడంతో గత మూడురోజులుగా కుడికాల్వ ద్వారా ఆంధ్రా రాష్ట్రానికి నీటివిడుదల చేస్తున్నారు.
సోమవారం నాడు సాగర్ జలాశయం నుండి 4,212క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి సోమవారం సాయంత్రం 14,126క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటుంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 504అడుగులకు నీటిమట్టం చేరింది. సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బిసి ద్వారా 400క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న వరద నీరు కొద్దిమేరకు పెరిగింది. సోమవారం సాయంత్రం 48వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుకొంటుండగా ప్రస్తుతం 824 అడుగుల నీటిమట్టం ఉంది.