S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అవినీతిలో కూరుకుపోయిన తెరాస ప్రభుత్వం

చిట్యాల, ఆగస్టు 1: తెలంగాణరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం అవీనీతిలో కూరుకుపోయిందని భాజపా కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన భాజపా మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి గోలి మధుసూధన్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరైనారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి బాకి పాపయ్య, ఉపాధ్యక్షుడు నకిరేకంటి మొగులయ్య, ప్రచారకార్యదర్శి గోశిక వెంకటేశం, అసెంబ్లీ కన్వీనర్ పాల్వాయి భాస్కర్‌రావు, దళితమోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి గోలి ప్రభాకర్‌లతో కలిసి మధుసూధన్‌రెడ్డి మనం-మహాసమ్మెళనం బహిరంగసభ వాల్‌పోస్టర్‌లను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు మాస శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధుసూధన్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గ్రామాలాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా రాష్ట్రంలోని సమస్యలు ఎక్కడిక్కక్కడే అపరిష్కతంగా ఉన్నాయని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమిలేదని విమర్శించారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజి వేలాది మంది విద్యార్థుల జీవితాలను ఇబ్బందికి గురిచేసిందని ప్రభుత్వ పకడ్బంధీ చర్యలు తీసున్నట్లయితే విద్యార్థులు నష్టపోయేవారు కాదన్నారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజికి విద్య, ఆరోగ్యమంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను బాద్యులుగా చేసి వారిచే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. ఈనెల 4వ తేదీన నల్లగొండలో జరిగే పార్టీ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ హాజరుకానున్నారని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 7వ తేదీన హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో జరిగే మనం-మహాసమ్మెళనం బహిరంగ సభకు గ్రామాల్లో బూత్‌స్థాయి నుండి ఐదుగురికి కంటే ఎక్కువగా హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మండల ప్రధానకార్యదర్శులు పల్లె వెంకన్నగౌడ్, పొట్లపల్లి నర్సింహ, పట్టణశాఖ అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీను, నాయకులు కంచర్ల శంకర్‌రెడ్డి, వడ్డెపల్లి మురళి, లెంకల సత్తిరెడ్డి, కోరబోయిన విజయ్, బత్తుల ప్రభాకర్‌గౌడ్, నార్సింగ్ వెంకటేశం, సుంచు శ్రీను, కుక్కల నాగరాజు, జోగు శేఖర్, గంజి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.