S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 02:22

శ్రీకాకుళం(రూరల్), జూలై 31: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ లెఫ్ట్ పార్టీలన్నీ సంయుక్తంగా ఆగస్టు 2న ప్రజాబంద్‌కు పిలుపునిచ్చామని దీనిని వ్యాపార వర్గాలు, ప్రజలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ కోరారు. క్రాంతి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

08/01/2016 - 02:22

సారవకోట, జూలై 31: అశోకుడు చెట్లు నాటించెను-రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటేను. ఈ వ్యాక్యాలను ప్రాధమిక విద్యాస్థాయిలో పాఠ్యాంశాల రూపంలో చదువుకున్నాం. వీటిని నిజం చేస్తూ సామాజిక అటవీశాఖ తాజాగ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. నాలుగేళ్ల కిందట రోడ్డు విస్తరణ పనులు జరిగినప్పుడు మండలంలోని అంగూరు నుండి నౌతల జంక్షన్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పురాతన వృక్షాలను తొలగించారు.

08/01/2016 - 02:21

ఎచ్చెర్ల, జూలై 31: పేలుడు పదార్థాలకు ముడి సరుకుగా వినియోగించే అమ్మోనియం నైట్రేట్‌తో విశాఖపట్నం నుండి ఝార్ఖండ్ వెళ్తున్న రెండు లారీలను పోలీసులు చిలకపాలెం వద్ద తనిఖీల్లో భాగంగా ఆదివారం పట్టుకున్నారు.

08/01/2016 - 02:21

శ్రీకాకుళం(టౌన్), జూలై 31: జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం పేరుతో కోట్లాది రూపాయల దుర్వినియోగం చాలదన్నట్లు మరో పది కోట్ల రూపాయలు రాష్ట్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసుల శాఖ మంత్రి నియోజకవర్గానికి మంజూరు చేయించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాషరావు విమర్శించారు.

08/01/2016 - 02:20

శ్రీకాకుళం(టౌన్), జూలై 31: ప్రభుత్వ ఉద్యోగికి తన సర్వీసులో ప్రజలకు అందించిన మంచి సేవలే గుర్తింపును ఇస్తాయని జిల్లా పోలీసు సూపరింటెండెంటు జె.బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పదవీ విరమణ చేసిన సిసియస్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి.వాసుదేవరావు, మహిళా పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ పి.మేరీలను ఆయన ఈ సందర్భంగా సత్కరించారు.

08/01/2016 - 02:19

తర్లుపాడు, జూలై 31: పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉందామని బయల్దేరిన ముగ్గురు విద్యార్థులు గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తర్లుపాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునగగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

08/01/2016 - 02:18

ఉలవపాడు, జూలై 31: స్థానిక ప్రభుత్వ వైద్యశాల నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ శిలాఫలకం ఆవిష్కరించారు. తొలుత చాకిచర్ల నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఉలవపాడులోని నూతన భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు కందుకూరు శాసనసభ సభ్యులు పోతుల రామారావు అధ్యక్షత వహించారు.

08/01/2016 - 02:17

ఒంగోలు,జూలై 31:్భరతమాల స్కీం కింద ఒంగోలు నుండి గొట్లకట్టు వరకు 71కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డుమంజూరైందని దానికి సంబంధించిన సమగ్రనివేదికను తయారుచేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఎంపిని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కిలోమీటరుకు 10కోట్లరూపాయల చొప్పున ఖర్చు అవుతుందన్నారు.

08/01/2016 - 02:16

ఒంగోలు, జూలై 31:వెనుకబడిన గౌడ్‌లు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూశాఖమంత్రి కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు. ఆదివారం స్థానిక పివిఆర్ బాలుర పాఠశాల గ్రౌండ్స్ ఆవరణలో దివంగత బలగాని వెంకటేశ్వరగౌడ్ ప్రాంగణంలో ప్రకాశం జిల్లా గౌడ్‌సంఘం,కల్లుగీత సంఘం జిల్లానూతన కార్యవర్గం ప్రమాణాస్వీకారమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

08/01/2016 - 02:15

నెల్లూరు, జూలై 31: ఇంటి నిర్మాణం చేపట్టాలన్నా.. క్రమబద్ధీకరించుకోవాలన్నా.. పన్ను మార్పు చేయాలన్నా.. కారుణ్య నియామకం పదోన్నతులు.. కొళాయి కనెక్షన్‌లు పొందాలన్నా. ఇలా ఏ పుర సేవలకైనా ఎంతోకొంత ముట్టచెప్పుకోవాల్సిందే. చివరకు వీధుల్లో చెత్తతీయాల్సి వచ్చినా కొంత నగదు చెల్లించుకోవాలి. లేకుండా పని జరగదు సరికదా.. సంబంధిత పనికి సంబంధించిన దస్త్రం ఎక్కడ ఉందో కనిపించకుండా మాయమైపోతుంది.

Pages