S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి

బేతంచెర్ల, జూలై 31:్భవిష్యత్తు తరాల మన పిల్లలు పస్తులు ఉండకూడదంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించి ఆంధ్రుల ఐక్యతను ఢిల్లీకి విన్పించేలాగా గర్జించాలని మండల జెఎసి, జర్నలిస్టుల యూనియన్ నాయకులు కె.సుబ్బారెడ్డి, వెంకట్రాముడు, ఆజాంబేగ్, సిపిఎం, సిఐటియు నాయకులు యల్లయ్య, సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పట్టణంలోని పాతబస్టాండ్‌లో జెఎసి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర ‘ప్రభుత్వ మొండివైఖరి నశించాలి.. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు..’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని గొప్పలు చెప్పిన బిజెపి నాయకులు కేంద్రంలో అధికారం చేపట్టి రెండేళ్లయినా ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే ఇప్పుడు ఎన్డీఎ ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వకుండా దోబూచులాడడం సరికాదన్నారు. కావున ప్రతిఒక్కరూ ఉద్యమించి ప్రత్యేక హోదా సాధనకు కదిలిరావాలని పిలుపునిచ్చారు. రాస్తారోకోలో ఏఐఎస్‌ఎఫ్ నేత ఉదయ్‌కుమార్, వాల్మీకి సంఘం నేత రాముడు, లయన్స్‌క్లబ్ సభ్యులు మురళీక్రిష్ణ, మార్కెట్ యార్డు డైరెక్టర్ విజయ్‌నాయక్, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, పట్టణ వాసులు పాల్గొన్నారు.