S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తిరుపతి జీవకోనలో పోలీసుల కార్టన్ - సెర్చ్

తిరుపతి, జూలై 31: తిరుపతి అర్బన్ ఎస్ పి ఆర్. జయలక్ష్మి ఆదేశాల మేరకు ఎ ఎస్పీ ఎంవి ఎస్ స్వామి పర్యవేక్షణంలో, వెస్ట్ డి ఎస్పీ కనకరాజు ఆదివారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జీవకోనలో గల కాంత్రినగర్, రాజీవ్‌గాంధీ కాలనీలో కార్టన్-సెర్చ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులున్నాయని, చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమచారం రావడంతో నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. 40 సెర్చ్ పార్టీలు, 80 కటాఫ్ పార్టీలు, 4 డంప్ పార్టీలుగా విభజించి తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 26 మంది అనుమానిత వ్యక్తులను, ముగ్గురు రౌడీ నేరస్తులను, 28 ద్విచక్ర వాహనాలను, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు డి ఎస్పీలు, 12 మంది సి ఐ లుత, 55 మంది ఎస్ ఐలు, ఎ ఎస్ ఐ లు, 750 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.