S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యానాంలో అంత్య పుష్కరాలు ప్రారంభించిన మల్లాడి

యానాం, జూలై 31: యానాంలో గోదావరి అంత్య పుష్కరాలను పుదుచ్చేరి వైద్య శాఖామాత్యులు మల్లాడి కృష్ణారావు ఆదివారం ప్రారంభించారు. శివం ఘాట్ వద్ద ఏడాది క్రితం ఏర్పాటు చేసిన పుష్కరిణి మాత విగ్రహం వద్ద వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులు అంత్య పుష్కరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మాణ్యం, దేవస్థానం కమిటీ అధ్యక్షులు కాపగంటి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.