S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కృషి

పులివెందుల, జూలై 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి పూర్తి సహాయసహకారాలు అందిస్తోందని బిజెపి రాష్ట్ర నాయకుడు కందుల రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బికె ఆర్ ఎం డిగ్రీ కళాశాలలో పార్టీ అసెంబ్లీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రెండురోజుల నుంచి ప్రత్యేక హోదాపై పలు రాజకీయ పార్టీలు రాజ్యసభలో మాట్లాడడం జరుగుతోందన్నారు. ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాన్ని విడదీసేందుకు కాంగ్రెస్‌పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఎపిని విడదీయడం జరిగిందన్నారు. అలా చేయడం వలన రాష్ట్రంలో పార్టీ బలపడుతుందనే ఉద్దేశ్యంతోనే పార్లమెంట్‌లో తలుపులు మూసి బిల్లును ఆమోదించిందన్నారు. అప్పట్లో విభజన చట్టపరంగా చేసి వుంటే ప్రస్తుతం ఈ సమస్య వచ్చేది కాదని, ప్రస్తుతం ప్రత్యేక హోదా ఇవ్వాలంటే చట్టపరంగా సమస్యలున్నాయని తెలిపారు. అయినా ఏపిని కేంద్రం అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విభజనకు ముందు సీమాంధ్ర కావాలని ఉద్యమాలు కూడా జరిగాయని, విభజన అనంతరం తెదేపా ప్రభుత్వాన్ని దక్కించుకొని వెనుకబడిన రాయలసీమకు ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి నిత్యం జపాన్, చైనా పర్యటనలకు వెళ్తూ రాజధాని అభివృద్ధికే మొగ్గుచూపుతున్నారని, అలా కాకుండా వెనుకబడిన జిల్లాలను కూడా కేంద్రం దృష్టి సారిస్తుందని తెలిపారు. లింగాల మండలానికి చెందిన కొందరు బిజెపి పార్టీలో చేరగా వారికి పార్టీ ఖండువా వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌రెడ్డి, అంజన్‌కుమార్, విజయలక్ష్మి, చలమారెడ్డి పాల్గొన్నారు.