S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మదనపల్లె మెప్మాలో స్తంభించిన కార్యకలాపాలు

మదనపల్లె, జూలై 31 : మదనపల్లె మెప్మాలో మహిళాసంఘాల లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. పిఆర్‌పి, ఆర్‌పిలు చేతివాటం ప్రదర్శించి బినామి జాబితాలతో తీసుకున్న రుణాలు చెల్లించాలని మహిళా సంఘాలకు బ్యాంకు నోటీసులు రావడంపై మహిళలు మరోసారి ఆందోళనలకు సన్నద్ధం అవుతున్నారు. మదనపల్లె మెప్మా పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఉన్నతాధికారులు ఇతర జిల్లాల అధికారిక బృందాలను నియమించి, ఆర్‌పి సమావేశాలు నిర్వహిస్తూ అన్ని కమిటీలను మార్పు చేస్తుండగా, కొందరు అడ్డుకోవడం, మరికొందరు సహకరిస్తున్నారు. మహిళా సాధికారితకై ప్రభుత్వం మెప్మా సంస్థను ఏర్పాటుచేసి ఆర్థికంగా మహిళల ఎదుగుదల, ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగం, చేతివృత్తులు, పొదుపు, రుణాల మంజూరు, అభయహస్తం, బీమా తదితరాలు అమలుచేసేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో మెప్మా పిఆర్‌పి, స్పెషలాఫీసర్‌ను ఏర్పాటుచేశారు. మెప్మా సక్రమంగా అమలుచేసేందుకు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, 20 మహిళా సంఘాలకు సమాఖ్య, 30 సమాఖ్యలకు ఆర్‌పిలను నియమించి గత 13 ఏళ్లుగా కార్యకలాపాలు చేపడుతున్నారు. గత రెండునెలలుగా మదనపల్లె మెప్మా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. 2012 నుంచి 2014 వరకు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రకటన చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పడంతో మదనపల్లె మెప్మా పిఆర్‌పి, ఆర్‌పిల చేతివాటంతో బినామీలుగా 48 మహిళా గ్రూపులను సృష్టించి 5 లక్షల వంతున 2.40 కోట్లు, మదనపల్లె పట్టణంలోని 1850 మహిళా సంఘాలకు రావాల్సిన అభయహస్తం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు 2 కోట్లు, చేతివృత్తుల శిక్షణకై ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులు సైతం దొంగలెక్కలు సృష్టించి దిగమింగారు. టిడిపి అధికారంలోకి రావడం, రుణాల ప్రకటనలో బినామిగ్రూపులకు ఆశాభంగం కాగా, బినామి గ్రూపుల పేర్లతో తీసుకున్న రుణాల రికవరీకై బ్యాంకు నోటీసులు ఇచ్చారు. తీసుకోని రుణాలకు సొమ్ములు ఎందుకు చెల్లించాలని మదనపల్లెలోని మహిళా సంఘాలు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను ఆశ్రయించారు. దీంతో జిల్లా మెప్మాపిడి నాగపద్మజను విచారణ అధికారిగా నియమించారు. సివో మంగేనాయక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని, మంగేనాయక్ కుటుంబసభ్యులపై పిఆర్‌పి ఉమేష్‌రావు అనుచరులు దాడిచేశారని మదనపల్లె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్‌పి దొంగలెక్కలకు పిఆర్‌పి సంతకాలతో బ్యాంకు అధికారులు మంజూరు చేసిన రుణాలపై కాకుండా బినామి గ్రూపులు సృష్టించిందీ సివోలే అంటూ నివేదికలిస్తూ వారిపై కేసు నమోదు చేయించారు. అవినీతికి పాల్పడిన పిఆర్‌పి, ఆర్‌పిలను తొలగించి వారి నుంచి బినామి గ్రూపుల పేర్లుతో దిగమింగిన రుణాలు రికవరీ చేయించాలని, సిఓలకు మద్దతుగా క్రాంతిచైతన్య మహిళా సంఘాలు, వామపక్షాలు, ప్రజాసంఘాలు, వైకాపా మహిళా నాయకులు సైతం ఆందోళనలు చేపట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. మెప్మా పిఆర్‌పి ఉమేష్‌రావు, ఆర్‌పి వసంతలపై సోషియల్ ఆడిట్ చేయించాలని ప్రజాసంఘాలు పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళా సంఘాలు రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని లావాదేవీలు పూర్తిగా నిలిపివేశారు. ఇదిలావుండగా మెప్మా అవినీతిపై స్థానిక, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆశ్రయిస్తూ అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని, స్వాహా చేసిన సొమ్ములు రికవరీ చేయించాలని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లావ్యాప్తంగా వ్యాపించడంతో తిరుపతి మెప్మాలో అవినీతి బట్టబయలైంది. జిల్లా ఉన్నతాధికారులు మదనపల్లె మెప్మాలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై ఓ కొలిక్కి తీసుకువచ్చి, కార్యకలాపాలు యధావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.