S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 00:03

న్యూఢిల్లీ, జూలై 31: విదేశీ మదుపరులు జూలైలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 12,600 కోట్ల రూపాయల కుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు.

08/01/2016 - 00:03

ఖమ్మం(ఖిల్లా), జూలై 31: తెలంగాణలో హరితహారం ఉద్యమంలా సాగుతోందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి పార్థసారధి అన్నారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఏడి కార్యాలయం సమీపంలోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 2.76కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చన్నారు. హరితహారం కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందన్నారు.

08/01/2016 - 00:03

ఖమ్మం రూరల్, జూలై 31: అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని కాచిరాజుగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన వీర్ల సునీత, గోవర్ధన్‌లకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దిలీప్ వయసు 12 నెలలు. తల్లి సునీత ఆ కుమారునికి అన్నం తినిపిస్తుండగా ప్రమాదవశాత్తు అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడక మరణించాడు.

08/01/2016 - 00:03

విశాఖపట్నం, జూలై 31: భారతీయ రైల్వేకు ఆర్థిక వెనె్నముకగా నిలుస్తున్న వాల్తేరు డివిజన్.. ఇపుడు సరుకు రవాణాలో అన్ని జోన్ల కంటే అగ్రగామిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 55.66 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా 6,456.84 కోట్ల రూపాయల ఆదాయాన్ని వాల్తేరు డివిజన్ సంపాదించగలిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-14) కంటే ఇది 4.82 శాతం అధికం.

08/01/2016 - 00:02

నేలకొండపల్లి, జూలై 31: తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా 4వేల మీసేవ కేంద్రాలతో ప్రజలకు వివిధ రకాల సేవలను అందజేస్తున్న ఇఎస్‌డి డెప్యూటి డైరెక్టర్ ఆఫ్ పైనాన్స్ ఎన్ మధుసూదనరెడ్డి వెల్లడించారు. ఆదివారం నేలకొండపల్లిలోని ఉత్తరేశ్వరస్వామి దేవాలయం నందు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలను నాటారు.

08/01/2016 - 00:02

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 31: నవకుండాత్మక సంపూర్ణ నవగ్రహ నవలక్షాజప మహాయజ్ఞం సందర్భంగా ఆదివారం గాయత్రి దేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో రాహువు, కేతువు, గాయత్రి అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున రాహు,కేతు గ్రాహాలకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. రాహుగ్రహానికి సంజనదేవితో, కేతు గ్రహానికి బ్రహ్మసరస్వతి దేవితో కల్యాణం నిర్వహించారు.

08/01/2016 - 00:01

ముదిగొండ, జూలై 31: గ్రామాల్లో, పొలాల గట్లపై, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను విరివిగా నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎంపి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

07/31/2016 - 23:59

గుంటూరు, జూలై 30: నాగార్జునసాగర్ కుడికాల్వ ఆధునికీకరణ పనులకు మరోసారి బ్రేక్ పడింది. ప్రభుత్వం మంచినీటి అవసరాలకు నీటిని విడుదల చేయటంతో పాటు కృష్ణా పుష్కరాలపనుల్లో అధికారులు బిజీ కావడంతో ఆధునికీకరణ అటకెక్కింది. దశాబ్ద కాలంగా ప్యాకేజీలకే కుడికాలువ పనులు పరిమితమవుతున్నాయి.. ప్రపంచ బ్యాంక్, ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ పనులు చేపట్టేందుకు దీర్ఘకాలిక ప్రాతిపదికన టెండర్లు పిలిచారు.

07/31/2016 - 23:59

గుంటూరు, జూలై 31: కృష్ణా పుష్కరాలలో యాత్రికులకు సేవలందించేందుకు ఘాట్ల వారీ సూక్ష్మ ప్రణాళికలను సిద్ధం చేసుకుని పటిష్ఠంగా అమలుపర్చాలని పుష్కరాల ప్రత్యేక అధికారి బి రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

07/31/2016 - 23:58

మంగళగిరి, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి వెనకడుగు వేయదని, పోరాడుతుందని... తల్లీ పిల్ల కాంగ్రెస్‌లు ప్రత్యేక హోదా విషయంలో చేస్తున్న హడావిడిని రాష్ట్ర ప్రజలు విశ్వసించరని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు.

Pages