S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేయాలి

ఖమ్మం(ఖిల్లా), జూలై 31: తెలంగాణలో హరితహారం ఉద్యమంలా సాగుతోందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి పార్థసారధి అన్నారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఏడి కార్యాలయం సమీపంలోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 2.76కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చన్నారు. హరితహారం కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందన్నారు. వర్షాలకు, వనాలకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని తీసుకున్నారని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీకి 40వేల చొప్పున మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని ఖమ్మం జిల్లా పూర్తిస్థాయిలో చేరుకుందన్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో హరితహారం లక్ష్యాన్ని వందశాతం చేరుకోవాలని ఆయన సూచించారు. వాతావరణ శాఖ సూచనలననుసరించి ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు అవసరమైన విత్తనాలు, ఎరువులను గ్రామస్థాయి కో ఆపరేటీవ్ సొసైటీల ద్వారా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో హరితహారం ముమ్మరంగా సాగుతుందని, కార్పొరేషన్ నిర్దేశించిన లక్ష్యాన్ని కూడా వందశాతం చేరుకోవాలని కమిషనర్‌కు సూచించారు.
ఔషద, పండ్ల మొక్కలు నర్సరీలలో అందుబాటులో ఉంచాలని, గృహ ఉపయోగకరమైన మొక్కలను పంపిణీ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డి దివ్య, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మణిమాల, స్వరూపారాణి, ఉద్యానవన ఉప సంచాలకులు శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కార్పొరేషన్ కమిషనర్ బొనగిరి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.