S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సూక్ష్మ ప్రణాళికలను పటిష్ఠంగా అమలుపర్చాలి

గుంటూరు, జూలై 31: కృష్ణా పుష్కరాలలో యాత్రికులకు సేవలందించేందుకు ఘాట్ల వారీ సూక్ష్మ ప్రణాళికలను సిద్ధం చేసుకుని పటిష్ఠంగా అమలుపర్చాలని పుష్కరాల ప్రత్యేక అధికారి బి రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రైవేటు వాహనాల కోసం పబ్లిక్ ప్రవైట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా జిల్లావ్యాప్తంగా 19,296 మంది ఉద్యోగులు పుష్కరాల విధులకు హాజరుకానున్నారన్నారు. ఘాట్లలో విధి నిర్వహణలో ఉండే ఉద్యోగుల కోసం పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులు వివిధ ప్రదేశాలకు సులువుగా వెళ్లేందుకు వీలుగా అన్ని ప్రాంతాల్లో సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లలో యాత్రికుల కోసం హైమాస్ లైట్లు, సిసి కెమేరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, బట్టలు మార్చుకునే గదుల ఏర్పాట్లు 4,5 తేదీలనాటికి పూర్తిచేయాలన్నారు. పుష్కరనగర్‌ల నుండి సమీపంలోని ఘాట్లకు యాత్రికులను చేరవేయడానికి వీలుగా పుష్కర ప్రత్యేక బస్సులను చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం జిల్లాకు 750 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రధాన వౌలిక సదుపాయాల ఏర్పాట్లకు సంబంధించిన పనులన్నీ దాదాపు పూర్తయ్యాయన్నారు. పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఘాట్లలో రోజుకు 9 లక్షల మంది పవిత్రస్నానం ఆచరిస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజి సంజయ్, అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ఠత్రిపాఠి, రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్, మునిసిపల్ కమిషనర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్-2 వెంకటేశ్వరరావు, డిఆర్‌ఒ కె నాగబాబు, వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.