S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 00:10

మంచిర్యాల, జూలై 31: మల్లన్న సాగర్ ముంపు ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు, ప్రజలపై ప్రభుత్వం లాఠీ చార్జి చేయించడంతో రైతులను పరామర్శించేందుకు వెళ్లే ప్రతిపక్షాలను అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటని మాజీ హోంమంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సబితా ఇంద్రా రెడ్డి ప్రశ్నించారు.

08/01/2016 - 00:09

బాసర, జూలై 31: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లిమాత కొలువైన బాసర సన్నిధిలో ఆదివారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలు గోదావరి నదీ తీరం వద్ద ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణలతో గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభించారు.

08/01/2016 - 00:07

భద్రాచలం, జూలై 31: భద్రాద్రిలో గోదావరి తీరం మళ్లీ పుష్కర శోభను సంతరించుకుంది. అంత్యపుష్కరాల సందర్భంగా ఆదివారం భద్రాద్రి రద్దీగా మారింది. భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాలు, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, కోలాటాల నడుమ సుముహూర్తాన ఆదివారం ఉదయం అంత్యపుష్కరాలను ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, సర్పంచి భూక్యా శే్వతలు ప్రారంభించారు.

08/01/2016 - 00:07

న్యూఢిల్లీ, జూలై 31: ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో డీజిల్, పెట్రోల్ వాహనాలపై నిషేధం.. కొత్త వాహనాల కొనుగోళ్లకు ఊతమిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్‌ఎ అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదిత వాహన ఆధునికీకరణ కార్యక్రమంతో కనీసం 3 శాతం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేసింది.

08/01/2016 - 00:06

ఖమ్మం (క్రైం),జూలై 31: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇస్తున్నామని తెలంగాణ టిఎన్‌జివోస్ కేంద్ర సంఘం గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. ఆదివారం స్థానిక టిటిడిసి భవన్‌లో జరిగిన టిఎన్‌జివోస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

08/01/2016 - 00:06

ఖమ్మం, జూలై 31: అధికారుల ఒత్తిడిని తట్టుకొని వ్యాపారం చేయలేమని, అనవసరంగా కేసులు పెడుతూ తమను ఇబ్బందులు పెడుతున్నారని మద్యం వ్యాపారులు చేసిన ఆరోపణలకు అధికారుల్లో చలనం వచ్చింది.

08/01/2016 - 00:05

ముంబయి, జూలై 31: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిలను రాబట్టుకోవడంలో భాగంగా ఆ సంస్థకు చెందిన 700 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులను వేలానికి వేస్తున్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. ఎస్‌బిఐతోసహా 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే.

08/01/2016 - 00:05

కొత్తగూడెం రూరల్, జూలై 31: హరితహారం పేరుతో పేద గిరిజన, గిరిజనేతర రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉరిహారాలు వేస్తోందని, అడవితల్లి ఒడినుండి ఆదివాసీ గిరిజనులను దూరం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. భూపోరాట కేంద్రాలైన రేగళ్ల, మైలారం, బంగారుచెలక, పెనగడప గ్రామాలలో ఆదివారం సిపిఐ బృందం పర్యటించింది.

08/01/2016 - 00:04

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 31: ఎంసెట్-2 లీకేజిపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ, వైద్య శాఖ మంత్రులు రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని తెలుగునాడు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి సుమంత్ డిమాండ్ చేశారు.

08/01/2016 - 00:04

ఖమ్మం(క్రైం), జూలై 31: సుప్రిం కోర్టు ఆదేశాలను అనుసరించి ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు భారీ జరిమానాలు విధించారు. జులై 1నుంచి చివరినాటికి 3800మందిపై కేసులు నమోదు చేసి వారినుంచి 11లక్షల రూపాయలను జరిమాన రూపంలో వసూలు చేశారు.

Pages