S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 00:14

భైంసా రూరల్, జూలై 31: జాతీయ పక్షి నెమళ్లను యధేచ్చగా వేటాడుతూ వేలల్లో స్మగ్లర్లు సొమ్ముచేసుకుంటున్నప్పటికి అటవీశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఆదివారం పట్టణ సమీపంలోని కమలాపూర్ గుట్టపై స్మగ్లర్లు జాతీయ పక్షి నెమళ్లను వేటాడుతుండగా స్తానికులు గమనించారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వేటగాళ్లు వేటాడిన నెమళి మృతదేహాన్ని వదిలి అటవీలోకి పరారయ్యారు.

08/01/2016 - 00:13

బాసర, జూలై 31: బాసర అమ్మవారి సన్నిధిలో ఆదివారం అంత్యపుష్కరాల సందర్భంగా ఆర్‌అండ్‌బి చీఫ్ ఇంజనీర్ క్వాలిటి కంట్రోలర్ అధికారి భిక్షపతి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అంతకుముందు గోదావరి అంత్య పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానాలు చేసి పూజలు నిర్వహించారు. వీరివెంట ఈఈ రమేష్, డిఈ రవీందర్‌రెడ్డి, సర్పంచ్ శైలజా సతీశ్వర్‌రావు పాల్గొన్నారు.

08/01/2016 - 00:13

తాండూర్, జూలై 31: మండలంలోని రేపల్లెవాడ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఆగి ఉన్న లారీని స్కార్పియో వాహనం డీకొనగా నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తాండూర్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం...

08/01/2016 - 00:13

భైంసా రూరల్, జూలై 31: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు రెండు గేట్లను ఆదివారం ప్రాజెక్టు అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టు పైభాగా భారీ వర్షాలు కురియడంతో ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చిచేరింది. దీంతో రెండు గేట్లు ఎత్తివేసి 4 వేల 10 క్యూసెక్కుల నీటిని సుద్దవాగు ప్రాజెక్టులోకి వదిలారు.

08/01/2016 - 00:12

లక్సెట్టిపేట, జూలై 31: మండలంలోని గ్రామ శివారులో గల వ్యవసాయ బావి వద్ద ఆదివారం విద్యుత్ మరమ్మత్తులు చేస్తూ ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్‌కు గురై చాతరాజు కిషన్ (28) మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం మృతుడు దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన వాడు. కాగా ఇతడు జైనూర్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో కాంట్రాక్టు బేసిస్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

08/01/2016 - 00:12

ఉట్నూరు, జూలై 31: రాబోయే మూడేళ్లలో గిరిజన గ్రామాలన్నింటికీ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీర చందులాల్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం కొమరంభీం ప్రాంగణంలోని పిఎమ్మార్సీ సమావేశ మందిరంలో ఐటిడిఏ పాలకవర్గ సమావేశానికి వచ్చిన సందర్భంగా మంత్రి చందులాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిందన్నారు.

08/01/2016 - 00:11

ఆదిలాబాద్, జూలై 31: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా జిల్లావ్యాప్తంగా 15,562మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష సందర్భంగా 144 నిషేదాజ్ఞలు విధించారు.

08/01/2016 - 00:11

ఉట్నూరు, జూలై 31: ఐటిడిఏ పాలకవర్గ సమావేశం ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు దిశా దశ చూపిస్తారని అనుకున్న అడవిబిడ్డలకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రజా ప్రతినిధులు నిరాశ మిగిల్చారు.

08/01/2016 - 00:10

ఆదిలాబాద్, జూలై 31: భారీ వర్షాలతో కుంటాల జలపాతం పరవళ్లను తొక్కుతూ జాలువారే అందాలు పర్యాటకులను ఆదివారం కనువిందు చేశాయి. ఎతె్తైన రాతికొండల నుండి ఎగిసిపడుతున్న జలసిరులను వీక్షిస్తూ పర్యాటకులు ఆనందసాగరంలో మైమర్చిపోయారు.

08/01/2016 - 00:10

న్యూఢిల్లీ, జూలై 31: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను ప్రముఖ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలతోపాటు రాజ్యసభలో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు పరిణామాలు ఈ వారం మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రధానంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Pages