S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైభవంగా రాహువు, కేతువు కల్యాణం

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 31: నవకుండాత్మక సంపూర్ణ నవగ్రహ నవలక్షాజప మహాయజ్ఞం సందర్భంగా ఆదివారం గాయత్రి దేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో రాహువు, కేతువు, గాయత్రి అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున రాహు,కేతు గ్రాహాలకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. రాహుగ్రహానికి సంజనదేవితో, కేతు గ్రహానికి బ్రహ్మసరస్వతి దేవితో కల్యాణం నిర్వహించారు. అనంతరం గాయత్రి అమ్మవారి కల్యాణం భక్తులు, అవధానులు, పూజారులు కనులపండువగా నిర్వహించారు. దేవి కల్యాణం అధ్యాంతం భక్తులు కనురెప్ప మూయకుండా వీక్షించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో అవధానుల పరమేశ్వరప్రసాద్ శర్మ అమ్మవారి కల్యాణంపై గురించి వివరించడంతో పాటు ప్రవచనాలను భక్తులకు వినిపించారు. భక్తులపై అమ్మవారి ఆశీస్సులు శ్రీరామరక్షగా పనిచేస్తాయన్నారు. ఒక యాగశాలలో తొమ్మిది గ్రహాలకు పూజ చేసి, కల్యాణం జరపడం ఎంతో విశిష్టతతో కూడుకున్నదని, ఈ ఆరాధనతో భక్తులు పున్నితులయ్యారన్నారు. ఈ పూజాదిక కార్యక్రమాల్లో పాల్గొని నవగ్రహాలకు పూజలు నిర్వహించి కల్యాణం జరిపించిన భక్తులకు ఎంతో పుణ్యం కలుగుతుందన్నారు. ఈ వారం రోజులు ఈ పూజల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులకు వారి కోర్కెలు తీరుతాయన్నారు. గాయత్రీ దేవి అమ్మవారి ఆశీస్సులు ఉండడంతోనే ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిసాయన్నారు.
రాహు, కేతు గ్రహాల కల్యాణంతో నవకుండాత్మక సంపూర్ణ నవగ్రహ నవలక్షాజప మహాయజ్ఞము ఆదివారం ముగిసింది. వారం రోజులపాటు విశిష్ట పూజలు, కల్యాణం వంటి కార్యక్రమాలను భక్తులు, పూజారులు, అవధానులు ఎంతో విశేషంగా జరిపించారు. చివరి రోజు గాయత్రి దేవి అమ్మవారికి కల్యాణం జరిపించి భక్తులకు అమ్మవారి ప్రసాదం వితరణ చేసి నిర్వాహకులు యజ్ఞాన్ని ముగించారు. వారం రోజుల పాటు జరిగిన పూజా కార్యక్రమాలు, చివరి రోజు నిర్వహించిన అమ్మవారి కల్యాణం వీక్షించిన భక్తులు పులకరించిపోయారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యామజాల శేషగిరి శర్మ, తుంగతుర్తి యుగంధర్ శర్మలను అవధానులు అభినందించారు. ఇలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో ధైర్యం కావాలని, అమ్మవారి ఆశీస్సులు వీరికి ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వ్యాఖ్యానించారు.