S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజధానికి ఆరు గ్రామాల్లో భూ సమీకరణ

విజయవాడ, జూలై 30: రాజధాని అమరావతి నగర పరిధిలోని ఆరు గ్రామాలకు సంబంధించిన భూ సమీకరణ పథకం (ఎల్పీఎస్) లేఅవుట్ల ముసాయిదా ప్రకటనను ఏపి సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ శనివారం నాడిక్కడ విడుదల చేశారు. వీటిని ఆయా పంచాయతీ కార్యాలయాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పత్రికా ముఖంగానూ, గుంటూరు జిల్లా, ఏపి సిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లోనూ ప్రకటించడం జరిగింది. వీటిపై అభ్యంతరాలు, సలహాలు లిఖితపూర్వకంగా ఆయా కాంపిటెంట్ అథారిటీలకు ఆగస్టు 30లోపు దాఖలు చేసిన ఎడల వాటిని పరిశీలించి తుది భూ సమీకరణ పథకం లే అవుట్ల ప్రకటన జరుగుతుందని చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు.
బోరుపాలెం గ్రామంలో 384.13 ఎకరాలకు గాను 3 లక్షల 82వేల 229 చదరపు గజాలు నివాస ప్రాంతంగాను, లక్షా 14వేల 67 చదరపు గజాలు వాణిజ్య ప్రాంతంగాను అర్హతల మేరకు గుర్తించి ఎల్పీఎస్ లేఅవుట్లు తయారుచేయడం జరిగింది. ఈ గ్రామంలో నివాస ప్లాట్లు 525, వాణిజ్య ప్లాట్లు 362 మొత్తం 887 ప్లాట్లకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. విల్లాల ప్లాట్లు 12 కోరుకోవడం జరిగింది.
అబ్బరాజుపాలెం గ్రామంలో 731.70 ఎకరాల విస్తీర్ణంలో 7 లక్షల 31వేల 700 చరపు గజాలు నివాస ప్రాంతంగాను, 2 లక్షల 30వేల 818 చదరపు గజాలు వాణిజ్య ప్రాంతంగాను అర్హతల మేరకు గుర్తించి ఎల్పీఎస్ లే అవుట్ తయారుచేయడం జరిగింది. ఈ గ్రామంలో నివాస ప్లాట్లు 821, వాణిజ్య ప్లాట్లు 614 మొత్తం 1435 ప్లాట్లకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. విల్లాల ప్లాట్లు 42 కోరుకోవడం జరిగింది.
దొండపాడు గ్రామంలో 270.21 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల 70వేల 206.80 చదరపు గజాలు నివాస ప్రాంతంగాను, 67వేల 551.70 చదరపు గజాలు వాణిజ్య ప్రాంతంగాను అర్హతల మేరకు గుర్తించి ఎల్పీఎస్ లే అవుట్ తయారుచేయడం జరిగింది. ఈ గ్రామంలో నివాస ప్లాట్లు 318, వాణిజ్య ప్లాట్లు 262, మొత్తం 580 ప్లాట్లకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. విల్లాల ప్లాట్లు 10 కోరుకోవడం జరిగింది. పిచ్చుకలపాలెం గ్రామంలో నివాస ప్లాట్లు 805, వాణిజ్య ప్లాట్లు 485 మొత్తం 1290 ప్లాట్లకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. విల్లాల ప్లాట్లు 43 కోరుకోవడం జరిగింది. అర్హతల మేరకు గుర్తించి ఎల్పీఎస్ లేఅవుట్ తయారుచేయడం జరిగింది. ఐనవోలు గ్రామంలో నివాస ప్లాట్లు 1335, వాణిజ్య ప్లాట్లు 924, మొత్తం 2259 ప్లాట్లకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. విల్లాల ప్లాట్లు 42 కోరుకోవడం జరిగింది. అర్హతల మేరకు గుర్తించి ఎల్పీఎస్ లేఅవుట్ తయారుచేయడం జరిగింది. శాఖమూరు గ్రామంలో నివాస ప్లాట్లు 1880, వాణిజ్య ప్లాట్లు 1236, మొత్తం 3,116 ప్లాట్లకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. విల్లాల ప్లాట్లు 100 కోరుకోవడం జరిగింది. అర్హతల మేరకు గుర్తించి ఎల్పీఎస్ లేఅవుట్ తయారుచేయడం జరిగింది. దొండపాడు గ్రామం చుట్టూ రహదారి కోసం అభ్యర్ధన రాగా అలాంటి అవసరం ఉండదని చెప్పడం జరిగింది. దొండపాడు గ్రామంలో వున్న రహదారులన్నింటినీ లేఅవుట్‌లో ఉన్న రహదారులతో అనుసంధానం చేయడం వల్ల సౌకర్యంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. దొండపాడు రైతులకు కేటాయించాల్సిన విల్లాల ప్లాట్లు పిచుకలపాలెంలో కేటాయించినచో తమకు అభ్యంతరం లేదని దొండపాడు రైతులు తెలుపగా అదే విధంగా ముసాయిదాలో ప్రతిపాదించడం జరిగింది.