S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలీసులపై కాల్పులు జరిపిన దొంగలు

హైదరాబాద్: అర్ధరాత్రి వేళ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులపై దొంగలు కాల్పులు జరిపిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పరిగిలో ఓ బ్యాంకు వద్ద ఆగి ఉన్న కారును తనిఖీ చేసేందుకు పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు. ఈ విషయం గమనించి దొంగలు వెంటనే పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో దొంగ కోసం గాలిస్తున్నారు. బ్యాంకులో చోరీ చేసేందుకే దొంగలు కారులో వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.