గృహ నిర్భందంలో అలంపూర్ ఎమ్మెల్యే
Published Saturday, 30 July 2016మహబూబ్‌నగర్ : అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను పోలీసులు గృహ నిర్భందంలో ఉంచారు. శుక్రవారం రాత్రి ఐజ పట్టణంలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను అరెస్టు చేయగా, శనివారం ఉదయం స్టేషన్ నుంచి క్యాంపు కార్యాలయానికి తరలించి గృహనిర్భందంలో ఉంచారు. శుక్రవారం రాత్రంతా శాంతినగర్ పోలీస్ స్టేషన్లోనే ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు. ఈ రోజు ఉదయం పోలీసులు బలవంతంగా ఎమ్మెల్యేను జీపులో ఎక్కించుకొని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలించారు. ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బంద్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఒక్క గ్రామాన్ని కూడా సందర్శించే హక్కు లేదా అని ప్రశ్నించారు.