S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిడిపి స్థలంపై.. సంవాదమా.. వివాదమా?

శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీలో వివాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నేతల మధ్య వ్యక్తిగత వైరం.. కేడర్‌పై ప్రభావితం చూపిస్తోంది! కంచుకోటలా ఉండాల్సిన సిక్కోల్ టిడిపి మంచుకోటలా కరిగిపోతోంది! ముఖ్యంగా వర్గాలు.. వైషమ్యాలు పార్టీ సంస్థాగత నిర్ణయాలను తల్లకిందులు చేస్తున్నాయి. జిల్లా మంత్రి అవునంటే - ప్రభత్వ విప్ కాదని. .వారి మధ్యలో అవును-కాదంటూ జిల్లా పార్టీ అధ్యక్షురాలు... ఇలా రెండేళ్ళ పాలన తర్వాత జిల్లా టిడీపీలో వర్గాలు నేతల నమ్ముకున్న కేడర్‌ను కుంగదీస్తున్నాయి. దీనికి తాజా తార్కణమే చంద్రబాబునాయుడు స్థలం వివాదం. ఈ వ్యవహారంలో నేతలు రెండు గ్రూపులుగా రోడ్డెక్కారు. జిల్లా టిడిపి సమన్వయకమిటీలో మంత్రి అచ్చెన్న ఈ స్థలం రూ. 1.55 కోట్లకు అమ్మేసినట్టు ప్రకటిస్తే - దానికి వ్యతిరేకంగా కళా, కూన, శివాజీ, గుండ వర్గం అండదండలతో జిల్లా పార్టీ అధ్యక్షురాలు పేరిట ‘ఖాళీ స్థలం అమ్మకం’ అంటూ పేపరు ప్రకటన చేశారు. అంటే - ఒకే పార్టీ నేతలైనవారే ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ కొన్ని సందర్భాల్లో సంవాదానికి దిగితే, మరికొన్ని సందర్భాల్లో వివాదానికి సై అంటున్న నేపథ్యంలో సి.ఎం. స్థలం విక్రయించే అంశంలో అచ్చెన్న - కూనలది సంవాదంగా సద్దుమణుగుతుందా? వివాదంగా ముఖ్యమంత్రి పంచాయతీకి చేరుతుందా?? అసలు ఈ స్థలం విక్రయం విషయంలో హీరో-జీరో ఎవరు!? అన్న ప్రశ్న కార్యకర్తలను గత రెండురోజులుగా తికమక పెడుతోంది.
శ్రీకాకుళం నగరపాలక సంస్థలో బలగ రూరల్ సర్వే నెంబరు 18/6,7,8లో 46 సెంట్లు విస్తీర్ణం కలిగిన స్థలాన్ని 2002 సంవత్సరంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కోసం రూ. 5 లక్షల రూపాయలకు అప్పట్లో పార్టీ అధ్యక్షుడు గుండ అప్పలసూర్యనారాయణ కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ స్థలానికి రూ. 1.55 కోట్లు ధర పలికింది. సర్వే నెం. 18/6,7,8లో 79 సెంట్లు భూమి బరాటం రమణయ్య, కలివరపు సత్యన్నారాయణలు టిడిపి నేత రెడ్డి చిరంజీలు
పేరిట 2000 సంవత్సరంలో అగ్రిమెంటుపొందారు. ఇందులో అయ్యప్పదేవాలయానికి 15 సెంట్లు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి 45.5 సెంట్లు, రెడ్డి చిరంజీవులు పేరున 17 సెంట్లు 2002, మే10న రిజిస్ట్రేషన్ అయ్యింది. సెంటు స్థలం అప్పటిలో 15 వేల రూపాయలు చొప్పున్న 6.83 లక్షల రూపాయలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ల ఫీజు, స్థలం అభివృద్ధి పనులు మొత్తంగా 10,04,395 రూపాయలు కాగా, అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుండ అప్పలసూర్యనారాయణ ఐదు లక్షల రూపాయలు ఇవ్వగా, ఇప్పటికీ ఇంకా 5,04,395 లక్షల రూపాయలు ఆ స్థలానికి సంబంధించి చంద్రబాబునాయుడు బకాయివున్నట్టు రెడ్డి చిరంజీవి పరుమార్లు పార్టీ పెద్దలకు వివరిస్తూ వినతులు ఇస్తునేవున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు తర్వాత 80 అడుగుల రోడ్డులో జిల్లా ఎన్టీఆర్ ట్రస్టు భవనం నిర్మాణానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ చొరవ చూపడంతో నిర్మాణానికి నిధులు సమీకరించే పనిలో బలగలో గల పార్టీ స్థలాన్ని విక్రయించేందుకు, గోప్యంగా పార్టీ అంతర్గతంగా వ్యవహారం చేసేందుకు మంత్రి అచ్చెన్నతోపాటు, పార్టీ పెద్దలంతా నిర్ణయించారు. ఆ మేరకు గత నెల జరిగిన జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇప్పటికీ బకాయిగల రెడ్డి చిరంజీవులకే అమ్మకానికి మొగ్గుచూపుతూ ఆయనతో బేరసారాలు సాగించిన తర్వాత రూ.1.55 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు మూడుమాసాల్లో ఆ మొత్తం పార్టీ అధినేతకు ఇచ్చేందుకు అచ్చెన్న నిర్ణయించి పార్టీ తరుఫున మాట ఇచ్చారు. అక్కడితో జిల్లా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నిర్మాణానికి 1.55 కోట్లు నిధులు ఉన్నట్టు ముఖ్యమంత్రి, నారా లోకేష్‌లకు అచ్చెన్న వివరించారు. ఆ సమయంలోనే ప్రభుత్వ విప్ కూన రవికుమార్, పలాస ఎమ్మెల్యే శివాజీలు పేపరు ప్రకటన వేస్తే మరింత ఎక్కువ మొత్తం రావచ్చునన్న సూచన చేశారు. ఆ సలహాకు అచ్చెన్న ఆగ్రహంతో పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్ళిపోయారు. నాడు సి.ఎం. స్థలం విషయంలో అచ్చెన్న - కూన గ్రూపుల మధ్య సంవాదమే అనుకున్న కేడర్‌కు తాజాగా నాటి సమన్వయకమిటీలో జరిగింది సంవాదం కాదు - వివాదమే..అన్నది ఇప్పుడు బహిర్గతమయింది. ఈ నెల 27న ఖాళీస్థలం అమ్మకం అంటూ జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషా పేరిట పేపరులో ప్రకటన ఇవ్వడంతో కథ మొదటికివచ్చింది. 2205 చ.గ.లు ఖాళీస్థలం అమ్మకానికి కలదంటూ ప్రకటించడంతో అచ్చెన్న ఆవేశం కట్టలుతెంచుకుంది. తాను ఒకసారి నిర్ణయించినప్పటికీ, అదే అంశాన్ని రొడ్డుకెక్కించారంటూ ఆయన మదనపడుతున్నట్టు మంత్రి అనుచరులు చెప్పుకొస్తున్నారు. కానీ- కొందరు పార్టీ నేతల వెన్నుదన్నులతో ఈ అంశంలో రూ.కోటిన్నర కుంభకోణం జరిగిపోతుందని, అడ్వాన్సుగా మాజీ జెడ్పీ చైర్మన్‌కి 25 లక్షల రూ.లు ముట్టిందన్న ప్రచారం జరగడంతో అచ్చెన్న నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సివచ్చిందని సీనియర్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అంతేకాకుండా, పార్టీకి అడ్వాన్సు చిల్లిగవ్వ ఇవ్వకుండా సి.ఎం.స్థలంలో లేవుట్ వేసి సెంటు రూ. 8 లక్షలకు అమ్మచూపుతున్నట్టు ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సి.ఎం. స్థల విక్రయంలో ‘విసీ’ వినూత్నంగా ప్రవేశించడం, విశాఖపట్నం నుంచి ఒక పెట్రోల్‌వ్యాపారిని ఆ స్థలం ఇన్‌ఛార్జి మంత్రి జిల్లా పర్యటన రోజే చూపించారు. అచ్చెన్నతో రగడకు కాలుదువ్వేలా జరిగే ఈ ప్రయత్నాలు, లక్షలాది రూపాయలు ఓ కుటుంబానికి అందినట్టు ప్రచారం జరగడం, కొనుగోలు చేసేందుకు అంగీకరించిన రెడ్డి చిరంజీవిని అగౌరవపర్చడం వంటి సంఘటనలన్నీ అచ్చెన్న ఉదాసీనతవల్ల జరిగిందంటూ పార్టీలో చర్చ ఆరంభమైంది. ఏదిఏమైనప్పటికీ సి.ఎం.స్థలం విక్రయం అంశం మళ్లీ తమ్ముళ్ళు రొడ్డెక్కించారు.