S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేము సైతం..!

శ్రీకాకుళం, జూలై 29: ప్రపంచదేశాల్లో భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఓ ప్రత్యేకత స్థానం ఉంది. వేదాలు నుంచి వైఫే వరకూ వచ్చిన సాంకేతిక మార్పుల్లో సైతం మనదేశం ‘మేము సైతం’ అంటూ ప్రపంచదేశాలతో పోటీపడుతూ ఇక్కడ సంతతి సాఫ్ట్‌వేర్ కంపెనీలను శాసించే స్థాయికి ఎదిగింది. ఇదే వారసత్వంగా విదేశీయులు భారతీయుల కళలను, ఆధ్యాత్మికతను ఎంచుకుంటూ అరుణాచలం, పుట్టపర్తి, షిర్డీ, తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యస్థలాల్లో శాశ్వతంగా ఆధ్యాత్మిక సేవను సాగిస్తూ తరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా పిలుపునిచ్చిన ‘వనం-మనం’ కార్యక్రమంలో శ్రీకాకుళానికి అతిథులుగా వచ్చిన విదేశీయ ఆడపడుచులు ఇక్కడ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం పలుగు-పార పట్టి.. నెత్తిన తట్టపెట్టి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేయగా, జిల్లావాసుల్లో మరింత స్ఫూర్తిని నింపారు.
ఆటవిడుపుగా ఖండాలుదాటి అతిథ్యం తీసుకునేందుకు ఆత్మీయ అతిథులుగా గుండ వారసుడుతో అమెరికా నుంచి వచ్చిన వీరంతా వనం-మనం పిలుపుతో ‘మేము సైతం’ అంటూ వేప, నేరడి, సిరుసుం, కొబ్బరి మొక్కలను నాటారు. అరసవల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో విదేశీ వనితలు మట్టితట్టలు పట్టుకుని మొక్కలకు నీరుపోసి నాటడం విశేషం. ఈ వనం-మనం కార్యక్రమంలో భాగంగా గుండ తనయుడు శివగంగాధర్, ఆయనతో అమెరికా నుంచి వచ్చిన గ్యారీ, లార్వేన్, బ్రండన్, డన్, మెరీ, ఫోర్జీ, హెథర్ వారంతా మొక్కలు నాటి వాటి సంవరక్షణ బాధ్యతలు సైతం వారే తీసుకోవడం గమనార్హం.